Pawan invited by tdp to join

Pawan invited by TDP to join, Murali Mohan, Telugu Desam Party, Pawan Kalyan Janasena party,

Pawan invited by TDP to join, Murali Mohan

పవన్ కి తెదేపా నుంచి ఆహ్వానం

Posted: 03/15/2014 02:33 PM IST
Pawan invited by tdp to join

పవన్ కళ్యాణ్ రాజకీయ రంగ ప్రవేశం వోట్లని చీల్చి వాళ్ళ అంచనాలను, గణాంకాలను తారుమారు చేస్తాయేమో అని భయపడుతూ వస్తున్నవాళ్ళకి శుక్రవారం నాడు పవన్ కళ్యాణ్ ప్రసంగం ఆ భయాన్ని తొలగించటమే కాకుండా మనవైపు తిప్పుకుంటే మంచిదనే అభిప్రాయాన్ని కలిగిస్తున్నదనిపిస్తోంది. 

ఎందుకంటే, పవన్ కళ్యాణ్ తనకి పదవుల మీద ఆశలేదని అనటమే కాకుండా కాంగ్రెస్ తప్ప మరే పార్టీకైనా మద్దతునివ్వటానికి తయారుగా ఉన్నానని చెప్పటమే అందుకు కారణం.

తెలుగుదేశం పార్టీ నుంచి మురళీ మోహన్ ద్వారా పవన్ కి ఆహ్వానం వచ్చేసిందప్పుడే! 

పవన్ కళ్యాణ్ వ్యూహ రచన ఇంకా పూర్తి కాలేదని ఆయన ప్రసంగంలో అర్థమౌతూనేవుంది.  ఎన్నికల కోసం ఎటువంటి ప్రణాళికలనూ ఆయన ఇంకా సిద్ధం చేసుకోలేదు కాబట్టి ఆఫర్స్ అన్నీ ఓపెన్ గానే ఉన్నాయని తెలుస్తోంది. 

అందువలన పవన్ కళ్యాణ్ తో మిగిలిన పార్టీల నుంచి ఆహ్వానం రావొచ్చు.  అయితే తెరాస గురించి ఆయన వ్యతిరేకంగా మాట్లాడకపోయినా ఆ పార్టీతో కలవకపోవచ్చు.  వైకాపా తో కూడా కలవటానికి సిద్ధంగా లేరనే అనిపిస్తోంది.  ఎందుకంటే జగన్ జైలు ప్రస్తావన కూడా ప్రసంగంలో వచ్చింది.  ఇక మిగిలింది తెదేపా.

కాబట్టి పవన్ ఒకవేళ కలిస్తే గిలిస్తే గనక తెలుగు దేశం పార్టీతో కలిస్తే తెదేపాకు తెలంగాణాలో కూడా మంచి స్థానం లభిస్తుంది.  తనకి పదవుల మీద ఆశలేదని చెప్పటం వలన ఆయన పదవులకోసం పోటీపడతారని, దాని వలన పార్టీలో ఉన్న సీనియర్స్ తో వివాదం వస్తుందనే భయం కూడా లేదు.  ఎన్నికలలో పోటీ చేస్తానని కూడా పవన్ అనకపోవచ్చు.  అప్పుడు సీట్ల అడ్జస్ట్ మెంట్లలో కూడా ఎటువంటి సమస్యా తలెత్తదు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles