Congress party at loss for candidates in seemandhra

Congress party at loss for candidates in Seemandhra, Municipal elections in Andhra Pradesh, Congress party facing loss of candidates, Very few nominations of Congress candidates, TDP, YSRCP

Congress party at loss for candidates in Seemandhra

కాంగ్రెస్ కి అభ్యర్థుల కరువు

Posted: 03/15/2014 10:14 AM IST
Congress party at loss for candidates in seemandhra

కాంగ్రెస్ కి సీమాంధ్రలో తన పార్టీ తరఫున ఎన్నికలలో పోటీచేసే అభ్యర్థులే కరువయ్యారు. 

మున్సిపల్ ఎన్నికలకు తెదేపా, వైకాపా లతో పాటు స్వత్యంత్ర అభ్యర్థులు అన్ని చోట్లా పోటాపోటీగా నామినేషన్ లు వెయ్యగా కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులే కరువై, సీమాంధ్రలో తుడిచిపెట్టుకుని పోతోందన్న సంకేతాలను బలంగా ఇచ్చింది.

శుక్రవారం మధ్యాహ్నం 3.00 గంటలకు పూర్తైన నామినేషన్ల గడువులో పది కార్పొరేషన్లలో 513 డివిజన్లకు 6777 నామినేషన్లు, 146 మునిసిపాలిటీలకు 3990 వార్డులకు 30000 కు పైగా నామినేషన్లు దాఖలయ్యాయి. 

పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలో 20 వార్డులకు ఒక్క నామినేషన్ కూడా కాంగ్రెస్ తరఫునుంచి రాలేదు.  నరసాపురం 31 కి 2, కొవ్వూరులో 23 కి 1, తణుకులో 34 కి 2, పాలకొల్లులో 31 కి 2, తాడేపల్లిలో 35 కి 4, భీమవరంలో 39 కి 13, నిడదవోలులో 28 కి 19 నామినేషన్లు మాత్రమే వచ్చాయి.  అలాగే నెల్లూరు, కడప, ప్రకాశం, శ్రీకాకుళం, కర్నూలు, చిత్తూరు, గుంటూరు జిల్లాలలోనూ, కాంగ్రెస్ అభ్యర్థులు లేకపోవటం, స్వతంత్ర అభ్యర్థులే ఎక్కువ సంఖ్యలో ఉండటం జరిగింది.

ఇక సీమాంధ్రకు పిసిసి అధ్యక్షుడిగా నియమించబడ్డ రఘువీరా రెడ్డి సొంత నియోజకవర్గం అనంతపూర్ లో పరిస్థితి మరీ ఘోరంగా ఉంది.  పామిడిలో 0, గుత్తిలో 1, మడకశిరలో 4, తాడిపత్రిలో 2, అనంతపూర్ లో 23, రాయదుర్గంలో 1, గుంతకల్లులో 5 మాత్రమే కాంగ్రెస్ తరఫునుంచి నామినేషన్లు వచ్చాయి. 

ఈ పరిస్థితిని సంకేతంగా తీసుకుంటే కాంగ్రెస్ భవితవ్యం సీమాంధ్ర ప్రాంతంలో ఎలా ఉంటుందన్నది స్పష్టమౌతోంది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles