Controversial comments of salman khurshid

Controversial comments of Salman Khurshid, Khurshid comments on SC EC, External Affairs Minister Salman Khurshid, Retired SC Judge Sodhi, Rahul Gandhi, Narendra Modi

Controversial comments of Salman Khurshid, Khurshid comments on SC EC

సుప్రీంకోర్టు ఇసి లను విమర్శించి ఇరుకునబడ్డ విదేశాంగ మంత్రి

Posted: 03/14/2014 12:16 PM IST
Controversial comments of salman khurshid

అంతకు ముందు న్యాయశాఖా మంత్రిగా కూడా పనిచేసిన ప్రస్తుత విదేశాంగ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ అత్యన్నుత న్యాయస్థానం మీద వ్యాఖ్యలు చేసేటప్పడు తనను తాను సరిచూసుకోవాలంటూ రిటైర్డ్ జస్టిస్ సోధీ హెచ్చరించారు.

"ఎవరు పార్లమెంటుకి వెళ్ళాలో ఎవరు వద్దో సుప్రీం కోర్టు నిర్ణయిస్తుందా?" అన్నారు సల్మాన్ ఖుర్షీద్ గురువారం లండన్ లోని స్కూల్ ఆఫ్ ఓరియంటల్ అండ్ ఆఫ్రికన్ స్టడీస్ మాట్లాడుతూ.  "మీ దేశంలోని విధానానికీ మా దేశంలోని విధానానికీ తేడా ఏమిటంటే, 31 మంది జడ్జ్ లు ఉన్నారు, 543 మంది పార్లమెంట్ సభ్యులన్నారు.  ఆ జడ్జ్ లు కూడా అందరూ కూర్చోరు ఇద్దరు ముగ్గురు తప్ప.  ఆ ఇద్దరు జడ్జ్ లే దేశంలో ఏం జరగాలో నిర్ణయిస్తారు.  పార్లమెంట్ సభ్యుల మీద విచారణ జరగాలా వద్దా అన్నది ఆ ఇద్దరే నిర్ణయిస్తారు!"  అంటూ తీవ్రస్థాయిలో విమర్శించారు ఖుర్షీద్. 

ఎలక్షన్ కమిషన్ మీద కూడా విమర్శలను గుప్పిస్తూ, "ఎన్నికల్లో అక్కడా ముగ్గురే నిర్ణయాలు తీసుకుంటారు.  ఎన్నికల ప్రచారంలో ఏ పదాన్ని ఉపయోగించాలి, ఏది ఉపయోగించగూడదన్నిది వాళ్ళే నిర్ణయిస్తారు.  ఎన్నికలు గెలవటానికి ఏం చెప్పాలన్నది కాదు, ఎన్నికలలో ఓడిపోవటానికి ఏం చెప్పాలో అది చెప్పాల్సివుంటుంది!" అన్నారాయన హాస్యోక్తిగా. 

గతంలో నరేంద్ర మోదీ మీద 2002 హింసాకాండను అడ్డుకోలేని నపుంసకుడనే వ్యాఖ్యలు చేసిన సల్మాన్ ఖుర్షీద్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అసంతృప్తిని చవిచూసారు. 

దీనితో రాజకీయ పార్టీలు కూడా సల్మాన్ ఖుర్షీద్ ని విమర్శించాయి.  "ఓడిపోతున్న నిరాశలో అలాంటి ప్రకటనలు చేస్తున్నారు కానీ దాని వలన మీరే అప్రతిష్ట పాలవుతున్నా" రంటూ భాజపా నాయకులు, "చెయ్యగూడని వ్యాఖ్యలవి, చాలా దురదృష్టకరమైన" వంటూ ఆఆపా నాయకులు ఖర్షీద్ వ్యాఖ్యలను ఖండించారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles