Limit stunts to delhi shivasena warns kejriwal

Limit stunts to Delhi Shivasena warns Kejriwal, Aam Admi Party Arvind Kejriwal, Shivasena Maharashtra, Mumbai tour of Kejriwal

Limit stunts to Delhi Shivasena warns Kejriwal

నాటకాలన్నీ ఢిల్లీలో ఆడుకో- ఆఆపాకి శివసేన హెచ్చరిక

Posted: 03/14/2014 11:05 AM IST
Limit stunts to delhi shivasena warns kejriwal

ముంబైలో ఆటోలో తిరగటం, లోకల్ ట్రైన్ లో తిరగటం లాంటి పనులతో వార్తలలోకి ఎక్కుతున్న ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్య నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ కి శివసేన తీవ్ర స్థాయిలో హెచ్చరికలు చేస్తూ, కేజ్రీవాల తన డ్రామాలను ఢిల్లీ వరకే పరిమితం చెయ్యాలని చెప్పింది. 

కేజ్రీవాల్ చర్చిగేట్ స్టేషన్ దగ్గర పెద్ద గుంపుతో నిలబడటంతో చుట్టూ మీడియా కూడా మూగి రాకపోకలకు అంతరాయం కలిగించింది.  దానితో, రోడ్డు మీద కాన్వాయ్ లో పోతూ ట్రాఫిక్ కి అంతరాయం కలిగిస్తున్నారంటూ రాజకీయ నాయకులను విమర్శించే కేజ్రీవాల్ లోకల్ ట్రైన్ లో ప్రయాణం చేసే సామాన్యులకు ఇబ్బంది కలిగిస్తే పరవాలేదా అని రాజకీయ విమర్శకులు ప్రశ్నించారు. 

49 రోజులు ఢిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేసి రాజీనామా చేసిన అరవింద్ కేజ్రీవాల్ లోక్ సభ ఎన్నికల బరిలోకి దిగుతూ ముఖ్య పట్టణాల మీదకు దృష్టి సారిస్తూ ముంబై, బెంగళూరు వోటర్ల మీద దృష్టిని కేంద్రీకరిస్తున్నారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

Today on Telugu Wishesh