Kejriwal threatens to send media to jail

Kejriwal threatens to send media to jail, AAP Arvind Kejriwal, Kejriwal fund raising program in Nagpur, Kejriwal criticizes media of taking money, Paid media kejriwal comments

Kejriwal threatens to send media to jail

మీడియాను జైల్లో పెట్టిస్తా నన్న కేజ్రీవాల్

Posted: 03/14/2014 12:49 PM IST
Kejriwal threatens to send media to jail

నాగ్ పూర్ లో ఎన్నికల ప్రచారం, నిధుల సేకరణ కోసం ఏర్పటు చేసిన సభలో మాట్లాడిన ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు అరవింద్ కేజ్రవాల్ మీడియా మీద మరోసారి మండిపడ్డారు.  మీడియా అంతా అమ్ముడుపోయిందని, నరేంద్ర మోదీని గెలిపించటం కోసం మీడియాలో అంతా పాటుపడుతున్నారని అన్నారు. 

గత సంవత్సరకాలంగా మోదీ మోదీ అంటూ మోదీ జపాన్ని చేస్తున్నారని, కొన్ని ఛానెల్సైతే అవినీతి అంతమొందుతోందని, రామరాజ్యం వస్తోందని, ఇక్కడ ఇదైంది, అక్కడ అదైంది అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారంటే ఎందుకో తెలుసా- వాళ్ళకు డబ్బులు ముట్టాయి కాబట్టి.

గుజరాత్ లో గత 10 సంవత్సరాలలో 800 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.  ఈ విషయం చెప్పరు మీడియాలో.  అద్వానీకి ఒక రూపాయకే భూమిని విక్రయించారు.  ఈ సంగతీ చెప్పరు.  అరవింద్ భద్రత గురించి మాట్లాడుతారు.  జడ్ సెక్యూరిటీ, వై సెక్యూరిటీ అంటూ వెధవ పనికిమాలిన సెక్యూరిటీ .... మోదీ గురించి మాత్రం సత్యం చెప్పరు.

ఈ సారి మీడియా మొత్తం అమ్ముడుపోయింది.  డబ్బులు తీసుకున్నారు.  ఇది చాలా పెద్ద కుట్రపూరితమైన చర్య.  దీని అంతు తేలుస్తాం.  మాకు అధికారం రానీండి, మీడియాకు చెందినవారితో సహా అందరి మీద కేసులు పెట్టి జైళ్ళకి పంపుతాం అన్నారు కేజ్రీవాల్. 

కేజ్రీవాల్ నిర్వహించిన నిధుల సేకరణ 5 సితారల హోటల్ లో జరిగటాన్ని విమర్శించిన నాగ్ పూర్ వాసులూ ఉన్నారు.  కేజ్రీవాల్ తో కలిసి భోజనం చెయ్యటానికి పెట్టిన రూ.10000 ఖర్చుకు బదులు విదర్భ వితంతువులకు సాయం చెయ్యొచ్చుగా అన్నారు వాళ్ళు. 

అరవింద్ కేజ్రీవాల్ మీడియా మీద విరుచుకు పడటం ఇది మొదటిసారి కాదు, ఆధారాలు లేకుండా ఆరోపించటం కూడా మొదటి సారి కాదు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles