Mamta banerjee supports jaya lalitha

Mamta Banerjee supports Jaya Lalitha, AIDMK chief Jaya Lalitha PM Candidate, Federal front, West Bengal CM Mamta Banerjee

Mamta Banerjee supports Jaya Lalitha

జయలలిత ప్రధానమంత్రి అభ్యర్థిత్వానికి మమత మద్దుతు

Posted: 03/08/2014 11:56 AM IST
Mamta banerjee supports jaya lalitha

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ శుక్రవారం నాడు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు తన మద్దతును తెలియజేసారు.  అందుకు ఈరోజు జయలలిత ఆమెతో మాట్లాడుతూ తనను ప్రధానమంత్రి పదవికి అర్హురాలిగా భావించినందుకు ధన్యవాదాలు తెలియజేసారు.

మమత బెనర్జీ, జయలలిత దేశ రాజీకీయాల గురించి శుక్రవారం చేసిన చర్చ, పరస్పర ఆదరణల వలన తమిళనాడులో ఏఐడిఎమ్కే కి కమ్యూనిస్ట్ పార్టీకి మధ్య ఉన్న సీట్ల సయోధ్య కూడా పునస్థాపితమయ్యేట్టుగా కనపడుతోంది. 

పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీని మీడియా ప్రతినిధులు జయలలిత ప్రధానమంత్రిగా బాధ్యతలను చేపట్టటానికి మీరు మద్దతునిస్తారా అని అడిగితే, అందులో సమస్యేముంది, నాకు కావలసింది సింహాసనం కాదు ప్రజల సంక్షేమం అన్నారామె. 

ఈమధ్యకాలంలో జరిగిన సర్వేలలో తృణమూల్ కాంగ్రెస్ కాంగ్రెస్, భాజపాల తర్వాత మూడవ స్థానంలో ఉంటుందని తేలింది.  అంటే ఎన్నికల తర్వాత ఆమె మద్దతు ఏ పార్టీకైనా బలాన్నిస్తుందన్న మాట.  అందువలన ఎవరు ప్రధాన మంత్రి కావాలన్న విషయంలో నిర్ణయాధికారం ఆమెకే ఉందని తృణమూల్ కోర్ కమిటీ సభ్యుడు అన్నారు. 

ధర్డ్ ఫ్రంట్ కి ఈ విషయం కొంత షాక్ గురిచేస్తోంది. 

జయలలిత ఆల్ ఇండియా అన్నా డిఎమ్కే మాత్రమే కాకుండా  తెలుగు దేశం పార్టీ, వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ, అసోం గనపరిషత్ పార్టీలతో కూడా చర్చలు జరిపిన మమత బెనర్జీ తనకు కూటమి కాబోతున్న ఫెడరల్ ఫ్రంట్ ముఖ్యం కానీ తన పదవి కాదన్న విషయాన్ని జయలలితకు పట్టం కట్టటానికి సిద్ధమవటంతో స్పష్టం చేసారు. 

సామాజికవేత్త అన్నా హజారే ఈ మధ్యనే మమతా బెనర్జీకి తన మద్దతుని ప్రకటించటం జరిగింది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles