Do not get away with new parties cautions kcr

do not get away with new parties cautions KCR, Kiran Kumar new party, Pawan Kalyan new party, TRS chief KCR

do not get away with new parties cautions KCR

కొత్త పార్టీలను చూసి ఆగం కాకుంరి- కెసిఆర్ హెచ్చరిక

Posted: 03/08/2014 10:50 AM IST
Do not get away with new parties cautions kcr

తెలంగాణా రాష్ట్రం ఎన్నో బలిదానాల వలన వచ్చిందని, ఇప్పుడు మనమంతా ఏకమై ఉండకపోతే నవ్వినోడి ముందు జారిపడ్డట్టు అవుతుందని వరంగల్ జిల్లా మెహబూబాబాద్ నియోజక వర్గ ఇన్ ఛార్జ్ నెహ్రూ నాయక్ తెరాసలో చేరిన సందర్భంగా తెలంగాణా రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖరరావు అన్నారు.  ఈ సందర్భంగా తెలంగాణాలో 17 ఎంపీ సీట్లు తమకి వస్తేనే చిరునవ్వుల తెలంగాణా ఏర్పడుతుందని అన్న కెసిఆర్, కొత్త పార్టీలను చూసి ఆగం కాకుంరి, అవి సంక్రాంతి గంగిరెద్దులలాంటి పార్టీలని, వాటిని చూసి మోసపోకండి అని అన్నారు. 

కొత్త పార్టీల గురించి మాట్లాడుతూ, కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ పెడుతున్నడట, ఆయన తర్వాత ఇంకొకడు బయలుదేరిండు.  ఆయనెవరో సినిమా యాక్టర్ పవన్ కళ్యాణట.  చిరంజీవి తమ్ముడట.  అన్న దుకాణం బందైంది ఇక తమ్ముడు షురూ పెడ్తడట అంటూ కెసిఆర్ వ్యంగ్యాస్త్రాలను సంధించారు. 

ఆంధ్రలో 25 ఎంపీ స్థానాలున్న.  మనకి 17 ఉన్నా వాటన్నిటినీ గెలుచుకుని అధికారం సంపాదిస్తేనే కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోగలుగుతం అంటూ కెసిఆర్ అధికారంలోకి రావటంలోని ప్రాముఖ్యతను తెలియజేసారు.  ఇల్లు అలకగానే పండగ కాదు.  రాష్ట్రపతి ఆమోదం లభించి 24 గంటలు కాకముందే చిరంజీవి, పళ్ళం రాజు, కావూరి సాంబశివరావులు కలిసి తెలంగాణా లోని ఏడు మండలాలను ఆంధ్రలో కలిపేసుకున్నరు.   అందువలన మనం అప్రమత్తంగా ఉండాలి.  శక్తివంతంగా తయారవాలి.  ఆంధ్రావాళ్ళు పైరవీకారులు.  నీళ్ళు, నిధులు, ఉద్యోగుల విషయంలో తెలంగాణాకు న్యాయం జరిగేట్టుగా చూసుకోవాలి.  అందువలన తెలంగాణా మొత్తం ఏకతాటి మీద నిలబడాల్సిన అవసరం ఉంది.  పోరాటం ఇంకా ముగియలేదు అంటూ కెసిఆర్ తెరాసను బలోపేతం ఎందుకు చెయ్యాలో వివరించారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles