Congress party welcome for pawan kalyan party

pawan kalyan, congress party, pawan kalyan new party, political party, congress party welcome for pawan kalyan party, Digvijay Singh speaks to media, Digvijay Singh, trs party.

congress party welcome for pawan kalyan party, Digvijay Singh speaks to media

పవన్ కళ్యాణ్ కు గాలం వేస్తున్న కాంగ్రెస్ పార్టీ ?

Posted: 03/08/2014 04:27 PM IST
Congress party welcome for pawan kalyan party

అన్నీ పార్టీలు  పవన్  కొత్త పార్టీ పై  కచ్చిఫ్ లు వేస్తున్నాయి కాబట్టి, మేము కూడా  ఒక కఛ్చిఫ్ వేస్తున్నాం. అనే విధంగా  కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ  దిగ్విజయ్ సింగ్  పవన్ కళ్యాన్  పెట్టే కొత్త పార్టీకి ముందుగానే గాలం వేస్తున్నారు.  ఆశ అనేది  మనిషి చేత ఎలాంటి నీచమైన పనైన చేయిస్తుందనటానికి  కాంగ్రెస్ పార్టీ  ఉదాహరణ. 

గతంలో కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ పార్టీ నాయకులను  పంచలూడదీసి కొట్టమన్న యువ నాయకుడు పవన్ కళ్యాణ్ కోసం ఆశగా ఎదురు చూస్తుంది. ఈరోజు  దిగ్విజయ్  సింగ్ మాట్లాడుతూ..  పవన్ కళ్యాణ్  పార్టీ పెట్టడాన్ని  మేము స్వాగతిస్తామని  చెప్పటంతో..  కాంగ్రెస్ నాయకులు ఖంగుతింటున్నారు. 

టీఆర్ఎస్ పార్టీ విలీనం పై చర్చలు చేసేందుకు కేకే ఢిల్లీ వస్తున్నారని, చర్చల అనంతరం టీఆర్‌ఎస్‌తో పొత్తుపై క్లారిటీ వస్తుందని ఆయన అన్నారు. పీసీసీల ప్రకటన తర్వాత తెలంగాణ, సీమాంధ్రలో పర్యటిస్తానని ఆయన తెలిపారు. పవన్ కొత్త పార్టీ అలాగే భవిష్యత్తులో పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తామన్నా స్వాగతిస్తామని ఆయన అన్నారు. కిరణ్ పార్టీ పెట్టనని ప్రామిస్ చేసి మాట తప్పారని దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యానించారు. 

‘‘ఏరుదాటిన తరువాత తెప్ప తగులపెట్టి కాంగ్రెస్ నాయకుల మాటలను ఎవరు నమ్మారు’’ రీసెంట్ గా  కేంద్ర మంత్రి జైరాం రమేష్ .. మీడియాతో మాట్లాడుతున్న సమయాంలో..  కిరణ్ కొత్త పార్టీ పై మీ అభిప్రాయం  ఏమిటి అని అడిగితే.. ‘‘హు ఈజ్  కిరణ్ ’’  కిరణ్ ఎవరు? ఆయన ఎవరో నాకు తెలియదని  నాలుక బయట పెట్టి, మీడియా ముందే అన్నాడు.  ఇలాంటి  నాయకులు   కాంగ్రెస్ లో ఉన్నంత కాలం  తెలుగు ప్రజలు  కాంగ్రెస్ పార్టీ కి ఓటు వేయటం అనేది చాలా అరుదైన ఘట్టమే  అని మీడియా వారే అంటున్నారు. 

-ఆర్ఎస్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles