Petrol liter price 220 in hyderabad

Petrol,petrol liter price 220, Petrol bunks in Hyderabad, flash strike, petrol liter price 220 in hyderabad, Petrol Bunks Strike in Hyderabad

petrol liter price 220 in hyderabad, Petrol bunks in Hyderabad shut to protest raids, Petrol Bunks Strike in Hyderabad

నగరంలో లీటర్ పెట్రోలో @ 220

Posted: 03/03/2014 01:14 PM IST
Petrol liter price 220 in hyderabad

హైదరాబాదులో లీటర్ పెట్రోలు 220 రూపాయల ధర పలుకుతోంది. తూనికలు, కొలతల శాఖ అధికారులు పెట్రోలు బంకులపై ఆకస్మిక దాడులు చేస్తుండడంతో, పెట్రోలు అమ్మకాల్లో బంకులు పాల్పడుతున్న దోపిడీ పెద్ద ఎత్తున బయటపడింది.

దీంతో పెట్రోలు బంకులపై పెద్ద ఎత్తున కేసులు నమోదవుతున్నాయి. దీనిని జీర్ణించుకోలేని పెట్రోలు బంకుల యజమానులు తూనికలు, కొలతల శాఖ అధికారులు తమపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపిస్తూ జంటనగరాల్లో ప్రైవేటు బంకులన్నీ మూసేశారు. 

పెట్రోలు పోసే మోడల్ అప్రూవల్ విషయంలో చమురు కంపెనీలపై చర్యలు తీసుకోవాల్సింది పోయి తమను వేధిస్తున్నారంటూ ఆరోపిస్తూ బంకుల యజమానులు గతరాత్రి నుంచి ఆందోళనకు దిగారు. దీంతో జంటనగరాల్లో రాత్రి నుంచి పెట్రోలు బంకులు మూతపడ్డాయి. దీంతో ప్రభుత్వ బంకుల్లో మాత్రమే పెట్రోలు అందుబాటులో ఉంది. 

కొన్ని చోట్ల పెట్రోలును బ్లాకులో లీటర్ 220 రూపాయలకు అమ్ముతున్నారు. దీంతో, వినియోగదారుల జేబులకు పెద్ద చిల్లు పడుతోంది. అధికారులు తమపై కేసులు నమోదు చేయమని హామీ ఇచ్చే వరకు బంకులు తెరిచేదిలేదని బంకుల యజమానులు స్పష్టం చేస్తున్నారు. దీనిపై వాహనదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

-ఆర్ఎస్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles