President rule after 41 years in ap state

President rule after 41 years in AP State, Cabinet approves President rule in AP, President rule as Kiran Kumar resigned, President rule in AP, President rule due to Telangana

President rule after 41 years in AP State

41 సంవత్సరాల తర్వాత రాష్ట్రానికి రాష్ట్రపతి పాలన

Posted: 02/28/2014 12:03 PM IST
President rule after 41 years in ap state

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో పివి నరసింహారావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జనవరి 11, 1973 లో జై ఆంధ్రా ఉద్యమం జరిగి ఆ తరుణంలో ప్రభుత్వం ఏర్పాటు చెయ్యటానికి కావలసిన మద్దతు లేకపోవటంతో రాష్ట్రపతి పాలన విధించటం జరిగింది. 

ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా వలన ఏర్పడిన సంక్షోభంతో తిరిగి రాష్ట్రపతి విధించటానికి కేంద్ర మంత్రి వర్గం ఆమోదించటంతో ప్రభుత్వం ఈరోజు నిర్ణయం తీసుకుంటోంది. 

భారత రాజ్యాంగంలోని 356 అధికరణ ప్రకారం ఏ రాష్ట్రంలోనైనా ప్రభుత్వం నడిచే పరిస్థితి లేకపోతే ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించవచ్చు.  ఆ సమయంలో మామూలుగా ప్రజాప్రతినిధుల ప్రాతినిధ్యంతో ఎన్నికైన ముఖ్యమంత్రి ఆయన సహాయక మంత్రులతో రాష్ట్ర పాలన నడపకుండా ఆ రాష్ట్రం కేంద్ర ప్రభుత్వ పాలన కిందికి వస్తుంది.  అప్పుడు రాష్ట్రపతి ఆ రాష్ట్రంలో తనకు సహాయంగా పనిచెయ్యటం కోసం పదవీ విరమణ చేసిన ఉద్యోగులను కానీ లేదా ఇతర ఉద్యోగులను కానీ నియమించవచ్చు.  అలా నియమించబడ్డవారు మంత్రుల బృంద స్థాయిలో పనిచేస్తారు. 

ఈ ఆర్టికిల్ 356 ని కేంద్ర ప్రభుత్వం దురుపయోగం చెయ్యటానికి కూడా అవకాశం ఉంది.  ప్రజలచేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులతో నడుస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం తన రాజకీయ లబ్ధి కోసం రద్దు చెయ్యటానికి కూడా ఇది పనికి వస్తుంది.  అందువలన సుప్రీం కోర్టులో ఈ విషయంలో వేసిన వివిధ పిటిషన్ల దృష్ట్యా సుప్రీం కోర్టు మార్గదర్శకాలను ఇస్తూ 1994లో  చారిత్రాత్మక తీర్పునివ్వటం జరిగి 2000 నుంచి రాష్ట్రపతిపాలన విధించిన సందర్భాలు తక్కువైపోయాయి.  కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం కోసం ఏర్పడ్డ సర్కారియా కమిషన్ కూడా రాష్ట్రపతి పాలనను విధించటానికి ఆర్టికిల్ 356 ని ఆచితూచి తప్పినిసరి పరిస్థితులలో వేరే మార్గం లేనప్పుడు మాత్రమే విధించాలని సూచించింది.

రాష్ట్రపతిపాలనంటే ఒక విధంగా ప్రభుత్వ యంత్రాంగం సుప్తచేతనంలో ఉన్నట్లే.  ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవటం అనేవి ఉండవు.  ఉద్యమాలు, నిరసనలకు స్వస్తి పలకటం జరుగుతుంది కాబట్టి ప్రజలు కూడా ఆ సమయంలో తమ నిరసన చేసే హక్కుని పోగొట్టుకుంటారు.  ప్రజాప్రతినిధులుండరు కాబట్టి తమ తరఫున ప్రాతినిధ్యం వహించేవారు ప్రాంతాలకు లేకుండా పోతారు. 

అయితే రాష్ట్రంలో ఎన్నికలు యధావిధిగా జరగబోతున్నాయి కాబట్టి ఈ సారి రాష్ట్రంలో ఈ సంక్షోభం కేవలం జూన్ 2 వరకే1973లో రాష్ట్రపతి పాలన విధించినప్పుడు సంవత్సరంపాటు రాష్ట్రం సుప్త చేతనావస్థలో ఉంది.

వివిధ రాష్ట్రాలలో ఇప్పటి వరకు 122 సార్లు రాష్ట్రపతి పాలన విధించగా మన రాష్ట్రంలో ఇది రెండవ సారి.  అప్పుడు జై ఆంధ్ర ఉద్యమం వలన రాష్ట్రపతి పాలన వస్తే ఈసారి జైతెలంగాణా రాష్ట్రపతి పాలనను తీసుకునివచ్చింది. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles