Main national parties losing ap state totally

Main National parties losing AP state totally, Bharatiya Janata party, Congress party, Telangana Rashtra Samiti, Telangana state formation, TRS merger in Congress paty

Main National parties losing AP state totally

ఆంధ్ర ప్రదేశ్ లో ఘోరంగా దెబ్బతిన్న రెండు జాతీయ పార్టీలు

Posted: 02/28/2014 11:10 AM IST
Main national parties losing ap state totally

ఎన్నికల నేపథ్యంలో దక్షిణ భారత దేశంలో అతి పెద్ద రాష్ట్రమైన ఆంధ్ర ప్రదేశ్ మీద కాంగ్రెస్ దృష్టి పెట్టినట్లుగానే భారతీయ జనతా పార్టీ కూడా కన్ను వేసింది.  

ఉద్యమంతో తెలంగాణా ప్రాంతంలో బలం పుంజుకుని గట్టిగా జెండా పాతిన తెలంగాణా రాష్ట్ర సమితితో పోటీ చెయ్యలేక పరాజయం పాలవుతున్న సందర్భంలో ఆ పార్టీని దెబ్బతీయటం కోసం కాంగ్రెస్ పార్టీ తెలంగాణా మేమే ఇస్తామంటూ చెప్పుకుంటూ వచ్చింది.  కానీ అందుకు సరైన సమయం కోసం వేచి చూడటంతోనే సమయమంతా గడిచిపోతోంది కానీ తెలంగాణా ఖ్యాతి ఎలాగైనా తెరాసాకే దక్కేట్టుగా కనిపించటంతో, ఉద్యమ పార్టీని తమ పార్టీలో కలుపుకుంటే అనే ఆలోచనకు తెరాస అధ్యక్షుడు కెసిఆర్ ఇచ్చిన హామీ కూడా ఊతమిచ్చింది.  మాకు అధికారాలు కాదు కావలసింది, తెలంగాణాయే ముఖ్యమంటూ చెప్పుకుంటూ రావటంతో కాంగ్రెస్ పార్టీ ఆఘమేఘాల మీద తెలంగాణా బిల్లును పార్లమెంటులో పాస్ చేయించుకోగలిగింది.  అయితే అందుకు భాజపా సాయం పనికి వచ్చింది.

ఇక భాజపా సంగతి చూస్తే రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలంగాణాలో తిరుగుతూ తెరాసకు ధీటుగా ప్రచారాలు చేస్తుండటం, కాంగ్రెస్ ఇవ్వకపోతే తెలంగాణాను మేమిస్తాం అని చెప్పటంతో కాంగ్రెస్ పార్టీ మీద ఒత్తిడి ఇంకా పెరిగింది నిజమే కానీ భాజపా కూడా తెలంగాణా వరకే పరిమితమైపోయింది.  అంతేకాకుండా తెరాస కాంగ్రెస్ లో విలీనమయినట్లయితే రెండు పార్టీల మధ్యనే పోటీ ఉంటుంది కదా అని ఆశించిన భాజపాకు తెరాస విలీనం కాకపోవటంతో మరింత ఇరకాటం ఏర్పడింది. 

ఈ ప్రక్రియలో రెండు పార్టీలూ ముందుగానే సీమాంధ్రను పోగొట్టుకున్నాయి, ఆశించిన తెలంగాణా ప్రాతంలో చూస్తే తెరాస బలంగా వేళ్ళూనివుంది.  అలా ఆంధ్రప్రదేశ్ లోని ఇరు ప్రాంతాలలోనూ కేంద్రంలోని అధికార విపక్ష పార్టీలు రెండూ రాజకీయంగా ఘోరంగా దెబ్బతిన్నట్లే కనిపిస్తున్నాయి. 

అయితే విశ్వాస స్థాపనా కార్యక్రమంలో భాజపా నాయకులు ఒక పక్క మా వలనే తెలంగాణా వచ్చిందని చెప్తూనే సీమాంధ్ర ప్రజలకు అన్యాయం జరగకుండా చూస్తామని మాటిస్తున్నారు.  కాంగ్రెస్ కూడా అదే పద్ధతిలో తెలంగాణా ఇచ్చింది మేమే నంటూ, సీమాంధ్ర ప్రజల వేదన తెలుసని వాళ్ళకి వరాల మూటలు చూపిస్తున్నారు.  కానీ ఈ రెండు పార్టీల ప్రకటనల ప్రభావం ఇరు ప్రాంతాలలోనూ పడుతున్నట్లుగా కనిపించటంలేదు.  

ఇది ప్రస్తుత పరిస్థితి.  ఎన్నికలకు ఇంకా సమయం ఉంది.  రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరిగినా ఆశ్చర్యపోనక్కరలేదు! 

-శ్రీజ

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles