Ap state chief secretary service extension

AP State Chief Secretary service extension, PK Mohanty Cheif Secretary, IYR Krishna Rao next CS, President rule in AP, AP State bifurcation process

AP State Chief Secretary service extension

రాష్ట్రపతి పాలనతో సిఎస్ పదవీకాలం పొడిగింపు!

Posted: 02/28/2014 01:56 PM IST
Ap state chief secretary service extension

ఈరోజుతో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పికె మొహంతి పదవీకాలం అయిపోతోంది.  అందువలన ముందుగానే పరిపాలన శాఖా అధికారులు ప్రధాన కార్యదర్శి అర్హతులున్నవారి జాబితాను 17 మందితో తయారు చేసారు.  కానీ అప్పటికే రాజీనామా చేసిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తాత్కాలిక నియమాలకు కూడా మొగ్గు చూపించలేదు.  దానితో ఆ జాబితాను గవర్నర్ కి పంపించగా ఆయనకు అందులో అధికారాలు లేనందున ఆయనా పట్టించుకోలేదు. 

ఈలోపులో ప్రధాన మంత్రి కలుగజేసుకుని ప్రధాన కార్యదర్శిని మార్చే ప్రయత్నం చెయ్యవద్దని, ఈ మూడు నెలలూ కొనసాగనివ్వమని అన్నారు.  రాష్ట్ర విభజన నేపథ్యంలో ప్రధాన కార్యదర్శిని మారిస్తే గందరగోళం ఏర్పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.  అయితే అలా ప్రధాన కార్యదర్శి పదవీ కాలాన్ని పొడిగించాలంటే గవర్నర్ కి రాష్ట్రపతి పాలనలోనే అధికారాలుంటాయి.  అందువలన ఈరోజు రాష్ట్రపతి పాలనకు ప్రకటన జరగటంతో గవర్నర్ లాంఛన ప్రాయంగా ప్రధాన కార్యదర్శి పదవీకాలాన్ని పొడిగిస్తున్నట్లుగా ఆదేశాలిచ్చే అవకాశం ఉంది. 

ప్రస్తుతం ప్రధాన కార్యదర్శిగా ఉన్న పికె మొహంతి తర్వాత ఆ స్థానానికి అర్హులుగా ఐవైఆర్ కృష్ణారావు ఉన్నారు కాబట్టి ఈ రోజు ఆయనను ఆ స్థానంలో కూర్చోబెడతారునుకున్నారు.  మొహంతిని రాష్ట్రపతి తనకి సలహాదారుగా కూడా నియమించవచ్చు.  అయితే మొహంతిని ప్రధాన కార్యదర్శి స్థానంలోనే కొనసాగించటం మంచిదన్న అభిప్రాయానికి నిన్న రాత్రే రావటం వలన ఈరోజు గవర్నర్ ఆదేశాలు కేవలం లాంఛనప్రాయమే అవుతాయి. 

రాష్ట్ర విభజన ప్రక్రియలో భాగమైన ఉద్యోగులు అధికారులను, ఆస్తులు అప్పులను విభజించే పనిని మొహంతి పర్యవేక్షిస్తున్నారు కాబట్టి ఆ పనిలో భగ్నం ఏర్పడకుండా సజావుగా పూర్తవటం కోసం మొహంతిని ఆ పదవిలోనే కొనసాగనివ్వాలని కేంద్ర ప్రభుత్వం భావించటమే దీనికి కారణం. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles