Ins sindhuratna failed in testing

INS Sindhuratna failed in testing, Smoke in Submarine Sindhurantna, 7 wounded 2 missing sindhuratna, Two Navy officers missing INS Sindhuratna

INS Sindhuratna failed in testing

భారత జలాంతర్గామి పరీక్షణలోనే ప్రమాదం

Posted: 02/26/2014 03:28 PM IST
Ins sindhuratna failed in testing

ముంబైకి 80 కిలోమీటర్ల దూరంలో ఐఎన్ఎస్ సిందురత్న సబ్ మెరైన్ ప్రమాదానికి లోనైంది.  ఏడుగురు నేవీ అధికారులకు గాయాలయ్యాయి, ఇద్దరి ఆచూకీ తెలియటం లేదు. 

ఈ సబ్ మెరైన్ ఉపయోగయోగ్యమా కాదా అన్నది పరీక్షించటానికి తీసుకెళ్ళిన వెస్టర్న్ కమాండ్ ఆధ్వర్యంలో జరిగిన పరీక్షణలోనే ఘోరంగా విఫలమవటంతో పాటు నష్టానికి గురిచేసింది. 

ఉదయం చేసిన ఈ పరీక్షణా యాత్రలో ముందుగా క్యాబిన్ లో ఒత్తైన పొగ కమ్మివేసిందని నేవీ అధికారి చెప్పారు.  వెంటనే అత్యవసర అగ్నిమాపక చర్యలను చేపట్టామని, ఈ లోపులోనే పొగ పీల్చిన అధికారులను ఎయిర్ లిఫ్ట్ చేసి హాస్పిటల్ కి పంపించటం జరిగిందని ఆయన అన్నారు.  మరో ఇద్దరు కనపడటం లేదని, వాళ్ళు అదే క్యాబిన్ లోనే ఉన్నారో లేకపోతే ఇంకా లోపల రహస్యంగా ఉన్న క్యాబిన్లలో దేనిలోనైనా ఉన్నారో తెలియలేదు అన్నారు నేవీ అధికారి. 

ఐఎన్ఎస్ సింధురత్నకి ఈ మధ్యకాలంలోనే ముంబైలో మరమ్మత్తులు జరిగి యోగ్యతా పరీక్షలు జరిగాయి.  అయితే సముద్రంలో చేసిన మొదటి పరీక్షలోనే ఇది విఫలమైంది.

ఈ సంఘటన జరిగిన సమయంలో అందులో 70 మంది వరకు నేవీ అధికారులున్నారు.  సంఘటన జరగగానే సబ్ మెరైన్ ని పైకి తీసుకునివచ్చారు.  గాయపడినవారిని నేవీ హాస్పిటల్ ఐఎన్ఎస్ అశ్వినికి చేర్చారు. 

గత ఏడు నెలలలో జరిగిన జలాంతర్గామి ప్రమాదాలలో ఇది మూడవది.  2013 లో ఐఎన్ఎస్ సింధు రక్షక్ మునిగిపోగా 18 మంది నేవీ సిబ్బంది మరణించారు.  జరిగిన నష్టం దృష్ట్యా చూస్తే దీని తర్వాత జరిగింది ఐఎన్ఎస్ బేట్వాకి.  ఐఎన్ఎస్ కొంకణ్ కి విశాఖపట్నంలో నష్టం జరిగింది.

సింధురక్షక్ కి జరిగిన నష్టం తర్వాత హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే సబ్ మెరైన్ వైఫల్యాల మీద సమగ్రంగా దర్యప్తు చేసి నివేదికలనివ్వమని కోరారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles