Salman khurshid calls modi impotent

Salman Khurshid calls modi impotent, Altercations and damaging remarks in the wake of elections, Narendra Modi called impotent by Khurshid

Salman Khurshid calls modi impotent, Altercations and damaging remarks in the wake of elections

ఎన్నికలు దగ్గరపడుతుంటే ఎదురుదాడులు మామూలే!

Posted: 02/26/2014 03:53 PM IST
Salman khurshid calls modi impotent

ఎవరన్నారన్నది ముఖ్యం కాదు.  ఎందుకంటే ప్రధానంగా ఎన్నికల బరిలో ఉన్న పార్టీలలో అధిష్టానం అభిప్రాయాలే నాయకుల మాటల్లో యాంప్లిఫై అవుతాయి.  అందువలన ఈ రోజు ఎవరేమన్నారన్నది మాత్రమే గమనించదగ్గ విషయం.  అందులో నిజానిజాలు కానీ అలా అనొచ్చా లేదా అన్నది కానీ చర్చించుకోవటం కూడా అనవసరమైన పనే.

భారత విదేశాంగ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ ఈ రోజు నరేంద్ర మోదీని నపుంసకుడు అనటం జరిగింది, దానికి వివరణనివ్వటమూ జరిగింది. 

2002 లో గుజరాత్ లో జరిగిన మారణహోమానికి మోదీకి ముడిపెడుతూ వస్తున్న కాంగ్రెస్ ఇక అది చాలా పాతదైపోయి కోర్టు నుంచి మోదీకి క్లీన్ చిట్ వచ్చి వీసా రద్దు చేసిన అమెరికా ప్రభుత్వం కూడా దిగిరావటంతో అదే మాటను కొద్దిగా మార్చి, ముఖ్యమంత్రిగా ఆ సంఘటనను ఆపలేని అసమర్ధుడు మోదీ అని అంటోంది.  మోదీ తన సొంత పార్టీ మంత్రినే నిలువరించలేకపోయారని, మాయా కొడ్నాని దగ్గరుండి మారణహోమాన్ని జరిపిస్తుంటే అడ్డుకోలేకపోవటమే ఆయన నపుంసకత్వానికి ఋజువు అంటారు ఖుర్షీద్. 

అన్నమాటలకు పశ్చాత్తాపం కాని మాటలను వెనక్కి తీసుకోవటం కానీ చేసే చర్యకు పూనుకోని ఖుర్షీద్ నపుంసకుడనకపోతే మరేమనాలి.  నపుంసకుడంటే చెయ్యవలసిన పని చెయ్యలేనివాడని అర్థం.  హింసాత్మక చర్యను మోదీ అడ్డుకోలేకపోయాడు.  ఆపగలిగే సామర్థ్యం లేకపోయింది ఆయనలో.  అందుకే ఆయనను నపుంసకుడన్నాను అన్నారు సల్మాన్ ఖర్షీద్. 

ఇంకా చాలా సమయం ఉంది.  మరెన్నో మాటల ఈటెలను సంధించటానికి బోలెడు సమయం ఉంది, రోజువారీ ఉపయోగించే వాటికంటే భాషలో మరెన్నో పదాలున్నాయి.  కాబట్టి ఇది ఆఖరు వ్యాఖ్యానమేమీ కాదు.  ఉత్తర ప్రత్యుత్తరాలను భవిష్యత్తులో ఇంకా చాలా చూస్తాం.

సృష్టిలో లింగభేదమేమీ లేదు అందరూ సమానమే కానీ, మగ నాయకులను ఆడవాళ్ళతో పోల్చి, వాళ్ళకి గాజులు సారెలు పంపించటమే ఎంతో అవమానకరమంటే నపుంసకులతో పోల్చటం మరింత అవమానకరంగా భావిస్తారు!

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles