Why delay in t state waiting for trs merger

Delay in T State, for TRS merger, Congress party, TRS party merger issue, Telangana appointed day, KCR victory rally, TRS alliance with congress, TRS merger with Congress

Why delay in T State, waiting for TRS merger?

తెలంగాణాలో జాప్యమెందుకు విలీనం కోసమేనా?

Posted: 02/26/2014 02:46 PM IST
Why delay in t state waiting for trs merger

ఎన్నికల నేపథ్యంలో,  తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు పార్లమెంటు ఉభయ సభలలో ఆమోదం లభించి వారం రోజులైనా ఇంకా జాప్యం జరుగుతుండటంతో సందిగ్ధ వాతావరణం నెలకొంటోంది.   ఎన్నికలు రెండు రాష్ట్రాలలోనా లేకపోతే ఒకే ఉమ్మడి రాష్ట్రంలోనా, రాష్ట్రపతి పాలనా లేకపోతే మరో ముఖ్యమంత్రిని నియమించి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిని రిలీవ్ చేస్తారా అన్నవి సర్వత్రా ఉత్కంఠను కలిగిస్తున్నాయి.  ఇక ముఖ్యమంత్రి బరిలో ఉన్న నాయకుల మనసులో అలజడుల గురించి చెప్పుకోనక్కర్లేదు. 

అయితే ఈ జాప్యాలకు కారణం తెలంగాణా రాష్ట్ర సమితి నిర్ణయంలో జాప్యమే కారణమని రాజకీయ రంగంలో చెవులు కొరుక్కుంటున్నారు.  తెలంగాణా ఇస్తే విలీనం చేస్తామని చెప్తూ వచ్చిన తెరాస ఇంతవరకు అందులో స్పష్టమైన నిర్ణయాన్ని తెలియజేయలేదు.  ఎన్నికలలో రాజకీయ పొత్తు పెట్టుకునే ఆలోచన కూడా ఉంది.  ఏ పొత్తూ లేకుండానే తెలంగాణా రాష్ట్రంలో సంపూర్ణ మెజారిటీ సంపాదించవచ్చనే నమ్మకం కూడా తెరాసకి ఉంది.  ఈ రోజు హైద్రాబాద్ లో జరుగుతున్న తెరాస విజయోత్సవం తర్వాత కాని పార్టీ వైఖరి ఎలా ఉంటుందో చెప్పలేం. 

అయితే కాంగ్రెస్ నేతలు మాత్రం విలీనానికి కెసిఆర్ అనుకూల సంకేతాలిచ్చారనే చెప్తున్నారు.  ఢిల్లీలో దిగ్విజయ్ సింగ్ మాట్లాడుతూ కెసిఆర్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో భేటీ అయినప్పుడు తెరాస ను కాంగ్రెస్ లో విలీనం చెయ్యటానికే మొగ్గు చూపించినట్లుగా ఆయన చెప్తున్నారు. 

కాకతాళీయంగా కెసిఆర్ విమానం కూడా ఆలస్యంగా చేరుకుంటోంది.  ఢిల్లీ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1.00 గంటకు హైద్రాబాద్ చేరుకోవలసిన కెసిఆర్ 2.00 గంటలకు విజయోత్సాహ ర్యాలీలో పాల్గొన్ని విజయరథం మీద గన్ పార్క్ కి వెళ్ళవలసిన షెడ్యూల్ 4.00 గంటలకు ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది.  విజయోత్సాహ ర్యాలీలో వచ్చిన స్పందన చూసిన తర్వాత పార్టీ నాయకులతో మాట్లాడిన తర్వాత కెసఆర్ కాంగ్రెస్ తో పొత్తు విలీనాల విషయంలో నిర్ణయం తీసుకోవచ్చు.

ఈ విషయంలో కాంగ్రెస్, తెరాసలు రెండూ ఆచితూచి అడుగులు వేస్తున్నట్టుగా కనపడుతోంది.  తెలంగాణా ఆవిర్భావాన్ని కూడ ప్రకటించినట్లయితే ఇక కాంగ్రెస్ చేతిలో ఏమీ ఉండదు, కేంద్రం మెడలు వంచి తెలంగాణా తెచ్చానని కెసిఆర్ అనే అవకాశం ఉండదని ఢిల్లీ పెద్దలు జాగ్రత్తగా ఉన్నట్లుగా కనిపిస్తోంది.  మరోపక్క మనకే ఆధిక్యత ఉన్నప్పుడు ఎన్నికల్లో పొత్తు కానీ, కాంగ్రెస్ లో విలీనం కానీ చేస్తే పార్టీకి ఏం ప్రయాజనం అన్నది కూడా తెరాస నాయకులు ఆలోచిస్తున్నట్టుగా కనబడుతోంది. 

మా పని మేం చేసాం అని కాంగ్రెస్ చెప్పనే చెప్పింది.  అందువలన జాప్యం మా వలన కాదు అన్న సంకేతాలను కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది.  ఎన్నికల లోపులో తెలంగాణా ఆవిర్భావ ప్రకటన జరగకపోతే ఎన్నికల కమిషన్ ఉమ్మడి రాష్ట్రంలోనే ఎన్నికలు జరుపుతుంది.   అందుకు తెరాస కూడా భయపడవలసిన అవసరం లేదు. 

కడుపుతో ఉన్నమ్మ కనక మానుతుందా అని, ఉభయ సభల్లో విభజన బిల్లు ఆమోదం పొందిన తర్వాత రాష్ట్రపతి ఆమోదం రాదా, మిగిలిన కార్యకలాపాలు జరగకుండా ఉంటాయా అన్న ధీమా కూడా తెరాస లో కనిపిస్తోంది. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles