Time up for windows xp operating system

Time up for Windows XP Operating system, April 8 last day for windows xp, Windows XP vulnerable, Migration from windows xp must

Time up for Windows XP Operating system

విండోస్ ఎక్స్ పి కి కాలం చెల్లింది- మైక్రోసాఫ్ట్ హెచ్చరిక

Posted: 02/25/2014 04:06 PM IST
Time up for windows xp operating system

2001 లో వాడకంలోకి వచ్చి బహుళాదరణ పొందిన విండోస్ ఎక్స్ పి ఆపరేటింగ్ సిస్టమ్ ఏప్రిల్ 8 వరకే సపోర్ట్ చేస్తుందని ఆ ఓఎస్ ఉత్పాదక సంస్థ మైక్రోసాఫ్ట్ హెచ్చరిస్తోంది. 

పెద్ద పెద్ద సంస్థలలో ఇంకా 16 శాతం మంది పాత ఆపరేటింగ్ సిస్టమ్ లోనే పనిచేస్తున్నారని, త్వరలోనే అది అంతరించిపోతుందని అందువలన మార్చుకోమని మైక్రో సాఫ్ట్ చెప్పగా ఆ సంస్థ భారతదేశ మేనేజింగ్ డైరెక్టర్ కరణ్ బజ్వా బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగాల్లో ఇంకా 35 శాతం వరకు దీనిమీదనే పనిచేస్తున్నారని చెప్తూ, సామాన్యంగా ఏ సాంకేతిక ఉత్పాదనకైనా సంస్థలు ఐదు సంవత్సరాల గ్యారెంటీ ఇస్తారని, కానీ మైక్రోసాఫ్ట్ దానికి రెట్టింపు పది సంవత్సరాలు ఇస్తుందని, అయినా అది కూడా దాటిపోయి ఇప్పిటికి 12 సంవత్సరాలు నిండుతున్నాయని అన్నారు.

2009 లో విండోస్ 7 ఆపరేటింగ్ సిస్టమ్ విడుదలైన దగ్గర్నుంచీ ప్రపంచ వ్యాప్తంగా 84 శాతం సంస్థలు ఆ కొత్త సిస్టమ్ కి మారిపోయాయి.  అందులో 25 శాతం గత 18 నెలల్లోనే మారటం జరిగిందని మైక్రోసాఫ్ట్ పరిశీలనలో తేలింది.  ఎక్స్ పి లో కొనసాగినట్లయితే వైరస్ కి ఎక్కువ అవకాశాలుంటాయని, దాని మెయింటెనెన్స్ ఖర్చు కూడా పెరిగిపోతుందని బజ్వా అన్నారు.  బ్యాంకింగ్ సంస్థలో ఏప్రిల్ 8 తర్వాత కూడా విండోస్ ఎక్స్ పి నే ఉపయోగిస్తూ పోయినట్లయితే ఏదైనా జరగరానిది జరిగినట్లయితే ఒక్క రోజులోనే 1100 కోట్ల రూపాయల నష్టం వాటిల్లే అవకాశం ఉందని అన్నారాయన. 

అదీ గాక రాబోయే కాలంలో అభివృద్ధి క్రమంలో కొన్ని సదుపాయాలు లేని ఎక్స్ పి వలన వ్యాపారంలో నష్టపోతారని కూడా హెచ్చరించిన మైక్రోసాఫ్ట్ బయోమెట్రిక్స్ లాంటి సాంకేతిక పురోగతిలో వెళ్ళలేకపోతారని కూడా హెచ్చరించింది. 

అంటే విండోస్ ఎక్స్ పి కి ఇంకా 28 పనిదినాలు మాత్రమే మిగిలివున్నాయన్నమాట!

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles