Rakhi sawant openly proposes rahul gandhi for marriage

Rakhi Sawant Openly Proposes Rahul Gandhi for marriage, Itom Girl Rakhi Sawant, Baba Ramdev, Narendra Modi, Bharatiya Janata Party, Arvind Kejriwal

Rakhi Sawant Openly Proposes Rahul Gandhi for marriage

రాహుల్ గాంధీతో పెళ్ళికి సిద్ధమంటున్న ఐటమ్ గాళ్ రాఖీ సావంత్

Posted: 02/25/2014 03:12 PM IST
Rakhi sawant openly proposes rahul gandhi for marriage

వార్తలలోకి రావాలనుకున్నా లేకపోతే ఎవరినైనా శపించదలచుకున్నా రాఖీ సావంత్ ఎప్పుడూ చెప్పే మాట ఒకటే, నేను ఆయన్ని పెళ్ళి చేసుకోవటానికి తయారు అని.  హిందీ చిత్రాలలో ఐటమ్ సాంగ్స్ లో నటిస్తూ అడపా దడపా వివాదాలతో వార్తలలోకి వచ్చే రాఖీ సావంత లోగడ యోగా గురువు రామ్ దేవ్ బాబా విషయంలో కూడా ఇదే విధంగా పెళ్ళి ప్రస్తావన తెచ్చింది. 

ఈసారి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడి మీద రాఖీ సావంత్ తన అస్త్రాన్ని ప్రయోగించింది.  భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోదీ మీద ప్రశంసలు కురిపిస్తూ ఆయన ప్రధానమంత్ర కావాలన్న ఆకాంక్షను వెలిబుచ్చిన రాఖీ సావంత్ ఆయన ప్రత్యర్థైన రాహుల్ గాంధీకి ఓపెన్ గా పెళ్ళి ప్రస్తావన చేసిందంటే, తనతో పెళ్ళంటే వరుడికి శిక్షేనని ఆమె ఉద్దేశ్యం కాబోలు. 

అంతేకాదు, భాజపా గనక తనకి ఎన్నికలలో టికెట్ ఇచ్చినట్లయితే తను ఒంటి కాలి మీద నిలబడి ప్రచారం చేస్తానంటోందీమె.  భాజపా తో చెలిమికి చిహ్నంగా భాజపాతో వైరమున్న అరవింద్ కేజ్రీవాల్ ని కూడా వదిలిపెట్టలేదు రాఖీ సావంత్.  ఆయన బ్రహ్మచారి కారు కనుక పెళ్ళి ప్రస్తావన తేకుండా, ఆయన మరోసారి ఢిల్లీకి ముఖ్యమంత్రి కాలేరని, ఒకసారి మోసం చేసారు కానీ ఢిల్లీ ప్రజలను మరోసారి మోసం చెయ్యలేరని అందామె.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles