Bjp goodwill soaring day by day

BJP goodwill soaring day by day, survey report favor BJP, opinion polls favor BJP, Nitish Kumar JDU, Lalu Prasad Yadav RJD, Congress party declining

BJP goodwill soaring day by day, opinion poll survey report

రోజురోజుకీ మోదీ నేతృత్వంలో పుంజుకుంటున్న భాజపా

Posted: 02/22/2014 10:13 AM IST
Bjp goodwill soaring day by day

యుపి బీహార్ లలో సగం స్థానాలు మోదీ నేతృత్వంలో నడిచే భారతీయ జనతా పార్టీకే నని ఒక టివి ఛానెల్ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది.  ఆ రాష్ట్రాలలో మొత్తం 61 స్థానాలను భాజపా దక్కించుకుంటుందని సర్వే నివేదికలో తేలింది.  ఉత్తర్ ప్రదేశ్ లోని 80 స్థానాలలో 40, బీహార్ లోని 40 స్థానాలలో 21 దక్కించుకుని భాజపా విజయకేతనం ఎగురవేసే అవకాశం ఇప్పటికే కనిపిస్తోందని సర్వే చెప్తోంది.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, మోదీ నేతృత్వంలో భాజపా రోజురోజుకీ బలపడుతోంది.  ఇదే సర్వే జనవరిలో నిర్వహించినప్పుడు భాజపాకి ఉత్తర్ ప్రదేశ్ లో 35 స్థానాలు దక్కించుకుంటుందని తేలింది.  

మరోపక్క కాంగ్రెస్ పార్టీ రోజురోజుకీ తన ప్రాభవాన్ని కోల్పోతూ కనిపిస్తోంది.  2009 లో 21 స్థానాలు సంపాదించుకున్న కాంగ్రెస్ పార్టీ 11 స్థానాలకే పరిమితమయ్యేట్టుగా సర్వే చెప్తోంది.  

భాజపాతో బంధాన్ని తెగతెంపులు చేసుకున్న నితిష్ కుమార్ నేతృత్వంలో నడిచే జనతా దళ్ (యునైటెడ్) 2009 లో 20 స్థానాలను కైవసం చేసుకున్నా ఇప్పుడు 9 స్థానాలు మాత్రమే దక్కించుకోగలుగుతుంది.  లాలూ ప్రసాద్ యాదవ్ నాయకత్వం వహించే రాష్టీయ జనతా దళ్ 5 సీట్లను మాత్రమే దక్కించుకునే అవకాశం కనపడుతోంది.  

మొత్తం మీద భాజపా కచ్చితంగా మోదీ నాయకత్వంలో బాగా పుంజుకుందని, ఇంకా పుంజుకునే అవకాశం కనిపిస్తోందని సర్వే నివేదికలు తెలియజేస్తున్నాయి.  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles