Vro and vra written test results today

vro and vra written test results today, Chief Commissioner Land Administration, Revenue department, Village Revenue Officer, Village Revenue Assistant

vro and vra written test results today, Chief Commissioner Land Administration

వీఆర్వో, వీఆర్యే పరీక్షా ఫలితాలు ఈరోజే

Posted: 02/22/2014 09:32 AM IST
Vro and vra written test results today

రెవిన్యూ శాఖలో ఎవరు గ్రామాధికారులన్నది ఈ రోజు తేలిపోతుంది. 

గ్రామ రెవిన్యూ అధికారి పోస్ట్ కి 11 లక్షల 84 వేల మంది పోటీ చెయ్యగా అందులో 1657 పోస్ట్ లకు మాత్రమే ఎంపిక చెయ్యబడుతుంది.  అలాగే గ్రామ రెవిన్యూ సహాయక ఉద్యోగం కోసం 88609 మంది పోటీలో నిలబడగా 4305 మందిని ఎంపిక చెయ్యటం జరుగుతుంది. 

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన ఈ అభ్యర్థుల పరీక్షలలో వారు సాధించిన మార్కులను భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సిసిఎల్) కి శుక్రవారమే అందజేయటం జరిగింది.  సిసిఎల్ ఈరోజు ఆ మార్కుల వివరాలను అభ్యర్థులకు వెల్లడించే ప్రయత్నంగా సిసిఎల్ వెబ్ సైట్ లో పెడుతోంది.  ఈరోజు మధ్యాహ్నం నుంచి ఆ వివరాలను అభ్యర్థులు చూసుకోవచ్చు.

రాతపరీక్షలో అభ్యర్థుల మార్కులు, రిజర్వేన్లు, ఎంపికైన అభ్యర్థుల వివరాలను సిసిఎల్ ఆదివారానికల్లా జిల్లాలకు అందజేయనుంది.  ఎంపిక కేవలం రాత పరీక్షా ఫలితాల మీదనే ఆధారపడివుంటుందని ప్రకటించిన నేపథ్యంలో అభ్యర్థులు తమ శక్తిమేరకు పోటీలు పడి పరీక్షలలో పాల్గొన్నారు. 

ఈరోజు రాత పరీక్షకు హాజరైన వారంతా పరీక్షా ఫలితాలలో నిక్షిప్తమైన తమ రాతను చూసుకోవటానికి ఆత్రుతగా ఉన్నారు. 

ఆదివారం ఫిబ్రవరి 2 2014 న నిర్వహించిన పరీక్షా ఫలితాలు మంత్రి రఘువీరా రెడ్డి చేసిన ప్రకటన ప్రకారం ఫిబ్రవరి 20 నే వెల్లడించవలసివుంది.  అదే షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 26 కల్లా నియామకాల అదేశాలు కూడా వెలివడవలసివుంది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles