Rajiv murderers death sentence reduced by supreme court

Rajiv murderers death sentence reduced by Supreme Court, Rajiv Gandhi Assassination, Rajiv Gandhi Assasins mercy petition, Supreme Court of India

Rajiv murderers death sentence reduced by Supreme Court

రాజీవ్ హంతకుల మరణశిక్షను జీవితఖైదుగా మార్చిన సుప్రీం కోర్టు

Posted: 02/18/2014 01:32 PM IST
Rajiv murderers death sentence reduced by supreme court

రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషుల శిక్షను మరణ శిక్ష నుంచి జీవితఖైదుగా సుప్రీం కోర్డు మార్చివేసి ఈ రోజు వాళ్ళ కుటుంబీకులకు ఊరట కలిగించింది. 

మరణ శిక్ష విధించిన తర్వాత క్షమాభిక్షను వేడుకున్న దోషుల విషయంలో అసాధారణ జాప్యం జరగటంతో సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం తమ మరణ శిక్షను జీవిత ఖైదుగా మార్చమంటూ పిటిషన్ పెట్టుకున్నారు దోషులుగా నిర్ధారించబడ్డ ముగ్గురు- పెరారి వాలన్, మురుగన్, శంతన్ లు.  కానీ కేంద్ర ప్రభుత్వం వాళ్ళన శిక్షను తగ్గించవద్దని వాదించింది.  కానీ ఆ అభ్యర్థనను తోసిపుచ్చుతూ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి పి.సదాశివం నేతృత్వంలో త్రిసభ్య ధర్మాసనం ఆ ముగ్గురి శిక్షలనూ జీవిత ఖైదులోకి మార్చివేసింది.  దానితో వాళ్ళ కుటుంబ సభ్యులు హర్షాన్ని ప్రకటించారు. 

2000 లో దోషులు క్షమాభిక్షకు అర్జీ పెట్టుకోగా రాష్ట్రపతి 2011 లో దాన్ని పరిశీలించి తోసిపుచ్చారు.  వాళ్ళు ముగ్గురూ ఇప్పటికే 23 సంవత్సరాలుగా జైలు శిక్షను అనుభవిస్తున్నారు.  రాజీవ్ గాంధీ హత్య 1991 లో జరిగింది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles