Modi finds fault with state division process

Modi finds fault with state division process, Congress party, Rajiv Gandhi, Rahul Gandhi, Sonia Gandhi

Modi finds fault with state division process

రాష్ట్ర విభజన ప్రక్రియను మరోసారి తప్పు పట్టిన నరేంద్ర మోదీ

Posted: 02/18/2014 02:10 PM IST
Modi finds fault with state division process

కర్నాటక రాష్ట్రంలో దావణగెరె లో ప్రసంగిస్తున్న భారతీయ జనతా పార్టీ ప్రధాన మంత్రి అభ్యర్థి నరేంద్రమోదీ రాష్ట్ర విభజన పట్ల అత్యుత్సాహం చూపిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం మీద విరుచుకు పడ్డారు. 

గద్దె దిగుతూ దిగుతూ ఆంధ్రావాసులకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు.   సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి సీమాంధ్రలో అడుగుపెట్టే ధైర్యం లేదన్నారాయన.  దక్షిణ భారత దేశంలో పర్యటన చేస్తారు కానీ ఆంధ్రప్రదేశ్ లో అడుగుపెట్టటం లేదని, కాంగ్రెస్ ని కేంద్రంలో నిలబెట్టిన ఆంధ్రప్రదేశ్ పట్ల సానుభూతి వాక్యాలు చెప్పటానికి కూడా ముందుకు రావటం లేదననారు మోదీ.

అవినీతి గురించి మాట్లాడుతూ రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్డు స్వయంగా ఢిల్లీ నుంచి వెళ్ళిన రూపాయి గ్రామాలకు చేరుకునేటప్పటికి 15 పైసలకు చిక్కిపోతున్నదని అన్న మాటలను గుర్తు చేస్తూ, అలా రూపాయిని అరగదీసిన హస్తం ఎవరిది అని ప్రశ్నించారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles