Discussion on t bill could not go ahead

Discussion on T bill could not go ahead, T bill in Parliament, Sushil Kumar Shinde, Seemandhra Ministers protest in Parliament

Discussion on T bill could not go ahead, Seemandhra Minsiters protest

పార్లమెంటులో బిల్లు మీద కొనసాగని చర్చ

Posted: 02/18/2014 12:58 PM IST
Discussion on t bill could not go ahead

12.15 కి హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే రాష్ట్ర పునర్విభజన బిల్లు మీద చర్చకు ప్రతిపాదించారు.  తర్వాత సీమాంధ్ర మంత్రులు, సభ్యుల ఆందోళనల మధ్య 12.45 వరకు సభ వాయిదా పడింది.  తిరిగి 12.45 కి ప్రారంభమైన సభలో అదేవిధంగా సీమాంధ్ర మంత్రులు, సభ్యులు స్పీకర్ వెల్ లోకి వెళ్ళి ఆందోళన చేస్తుండగా షిండే తెలంగాణా రాష్ట్ర డిమాండ్ కి పూర్వ చరిత్రను చదవదటం మొదలుబెట్టారు. 

కానీ సీమాంధ్ర ఎంపీలతో పాటు ఇతర ఎంపీలు కూడా వెల్ లోకి వెళ్ళి ఆందోళన చేస్తుండటంతో పరిస్థితి అదుపులో లేకపోవటంతో సభ 3.00 గంటల వరకు వాయిదా వేసారు స్పీకర్ మీరా కుమార్.

సుశీల్ కుమార్ షిండే దగ్గర రక్షణగా తెలంగాణా ఎంపీలను నిలబడివుండటం జరిగింది.  సోనియా గాంధీ కానీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ కానీ బిల్లు మీద చర్చ ప్రారంభించిన సమయంలో లోక్ సభలో లేకపోవటం విశేషం.

పార్లమెంట్ బయట పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు జరిగాయి.  పార్లమెంట్ ప్రధాన ద్వారాన్ని మూసివేసారు.  పార్లమెంటు వైపుగా వస్తున్న వాహనాలను భద్రతా బలగాలు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. పార్లమెంట్ సమీపంలో రాష్ట్రపతి భవన్ ఎదురుగా ఉన్న విజయ్ చౌక్ నుంచి ఎంపీలు, మంత్రులను పోలీసులు బలవంతంగా పంపించేస్తుండగా వాగ్వాదం చోటుచేసుకుంది.  దాంతో పరిస్థితి ఉద్రిక్తంగా తయారైంది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles