Discussions on telangana bill in parliament

Telangana Bill updates, discussions on Telangana Bill in parliament, AP State Reorganizaton Bill, BJP Amendments in T bill, T Bill in Rajyasabha

Discussions on Telangana Bill in parliament

ఈరోజు ఉత్కంఠ భరితమైన పార్లమెంట్

Posted: 02/18/2014 09:22 AM IST
Discussions on telangana bill in parliament

లోక్ సభా వ్యవహారాలలో 41 వి అంశంగా చేర్చబడ్డ రాష్ట్ర విభజన బిల్లు మీద చర్చ మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం కానుంది.  అది ఎలా సాగుతుంది, పర్యవసానం ఎలావుంటుందన్నది సర్వత్రా ఉత్కంఠను నెలకొల్పుతోంది. 

"పెళ్ళి పారిపోయి చేసుకున్నాం, కానీ రిసెప్షన్ అందరితో కలిసి చేసుకుందాం" అన్నట్లుగా, 13 వ తేదీన పార్లమెంటులో గందరగోళం మధ్య ఎవరికీ తెలియకుండా, అర్థం కాకుండా ప్రవేశపెట్టిన రాష్ట్ర పునర్విభజన బిల్లు మీద చర్చ మాత్రం ఈరోజు అందరి సమక్షంలో బాహాటంగా చెయ్యబోతున్నారు- బహిష్కరించగా మిగిలిన ఎంపీలతో. 

ఎక్కువ సమయం లేకపోవటంతో లోక్ సభలో ఒకరోజు, రాజ్య సభలో ఒకరోజు కేటాయించి విభజన బిల్లును గట్టెక్కిద్దామనుకుంటోంది కాంగ్రెస్ పార్టీ.  కాకపోతే భాజపా ధోరణే అంతుబట్టకుండా ఉంది.  సీమాంధ్ర మంత్రులు, ఎంపీలు బిల్లుకి మద్దతుకు నిరాకరిస్తున్నారు.

భాజపాను మంచి చేసుకునే ప్రయత్నంలో యుపిఏ పెద్దలంతా భాజపా సీనియర్ నాయకులందరితోనూ భేటీ అవుతున్నారు.  ఫలితం ఎలా ఉంటుందో తెలియకుండా ఉన్న సందర్భంలో తెరాస నాయకులు మాత్రమే ఈరోజు లోక్ సభలో బిల్లు ఆమోదం పొందుతుందని పూర్తిగా భరోసా ఇస్తున్నారు.  

రాజ్యసభలో కూడా బిల్లు కోసం తయారీలు జరుగుతున్నాయి.  చర్చకు రెండు గంటల సమయాన్ని కేటాయించటమే కాకుండా, లోక్ సభలో బిల్లును ప్రవేశపెట్టినప్పుడు జరిగిన గందరగోళం రాజ్యసభలో జరగకుండా ఉండటం కోసం తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 

ఈ లోపులో భాజపా కూడా బిల్లు విషయంలో 33 సవరణలను లోక్ సభ సెక్రటేరియట్ కి సోమవారం రాత్రి అందించింది.  వాటిలో 10 సవరణలకి మాత్రం కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలియజేసింది.

ఈరోజు విభజన బిల్లు విషయంలో పార్లమెంట్ లో జరిగే తంతులను ఎప్పటికప్పుడు అప్ డేట్ చేసి మీకందిస్తాం.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles