President rule for ap

Possible President rule for AP, AP Chief Minister, Kiran Kumar Reddy, AP State reorganization bill, discussion on T bill in parliament

Possible President rule for AP

రాష్ట్రపతి పాలనలోకి ఆంధ్రప్రదేశ్?

Posted: 02/18/2014 09:59 AM IST
President rule for ap

ఈరోజు పార్లమెంట్ లో రాష్ట్ర విభజన బిల్లు మీద చర్చ మొదలైన వెంటనే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసే అవకాశాలున్నాయి.  మధ్యాహ్నం 3 గంటలకు ఆయన రాజీనామా చేస్తారని సమాచారం.  మధ్యాహ్నం 12 గంటలకు పార్లమెంట్ చర్చలు 3 గంటల వరకు వచ్చేసరికి పర్యవసానం ఏమిటన్నది స్పష్టమయ్యే అవకాశం ఉండటంతో కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా సమర్పించటానికి మధ్యాహ్నం 3 గంటలకు ముహూర్తం పెట్టారని తెలుస్తోంది.

తన మాటలకు విలువివ్వకుండా ఒంటెద్దు పోకడతో పోయిన కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచెయ్యదలచుకున్న కిరణ్ కుమార్ తనతో పాటు పెద్ద బృందాన్నే కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు తీసుకునిపోబోతున్నారు.  కిరణ్ కుమార్ పెట్టబోయే పార్టీకి జై సమైక్యాంధ్రా అనే పేరు పెట్టవచ్చనే ఊహాగానాలు కూడా ఊపందుకునివున్నాయి. 

ఆపధర్మ ముఖ్యమంత్రినైనా అధిష్టానం సూచించాలి లేదంటే రాష్ట్రపతి పాలనకైనా పచ్చజెండా ఊపాల్సివుంటుంది.  అందులో రాష్ట్రపతి పాలనకే ఎక్కువ మొగ్గు చూపించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు చెప్తున్నాయి. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles