2014 union budget boons

2014 Union Budget boons, Finance Minister Chidambaram, Union budget election budget, excise rate reduced 2014 budget

2014 Union Budget boons, Finance Minister Chidambaram

ఈ ఆఖరు బడ్జెట్ లో ప్రభుత్వ వరాలు

Posted: 02/17/2014 02:11 PM IST
2014 union budget boons

ప్రభుత్వం ప్రవేశపెట్టినా బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వం ఎడాపెడా వరాలిచ్చేసింది.  అందులో ప్రధానమైనవి ఇవి-

అన్ని వస్తువుల మీదా ఎక్సైజ్ సుంకాన్ని 12 నుంచి 10 శాతానికి తగ్గించటం జరిగింది.  చిన్న కార్ల మీద ఎక్సైజ్ ని 12 నిం 8 శాతానికి తగ్గించారు.  ఫలితంగా చిన్న కార్లు, ద్విచక్ర వాహనాలు, మొబైల్ ఫోన్ల ధరలు తగ్గిపోతున్నాయి. ఇంకా సబ్బులు ఇతర నిత్యావసర వస్తువుల మీద ధరలు తగ్గిపోతాయి. 

ఉన్నత విద్యకు కేటాయించిన నిధులు రూ.79459 కోట్లు.  వైద్యరంగంలో అభివృద్ధికి కేటాయించిన నిధులు రూ.36300 కోట్లు.  మహిళా శిశు సంక్షేమానికి రూ.21000 కోట్లు.  మానవ వనరులు అభివృద్ధికి రూ.67000 కోట్లు.  పంచాయతీరాజ్ శాఖకు రూ.7000 కోట్లు.  తాగునీటి పథకానికి రూ.15600 కోట్లు.  రైల్వేకి రూ.29000 కోట్లు.  హౌసింగ్ కి రూ.6000 కోట్లు.  నిర్భయ ఫండ్ రూ.1000 కోట్లు.  పట్టణ ప్రాంతాలలో గృహ నిర్మాణానికి రూ.2000 కోట్లు.  సామాజిక న్యాయశాఖకు రూ.6730 కోట్లు.  గృహ నిర్మాణ, పేదరిక నిర్మూలన శాఖకు రూ.6000 కోట్లు.  తాగునీటి పారిశుధ్య కార్యక్రమానికి రూ.15620 కోట్లు.  సైన్యంలో ఒకే ర్యాంక్ ఒకే పెన్షన్ పథకానికి రూ.500 కోట్లు.  రక్షణ రంగానికి రూ. 2.24 లక్షల కోట్లు.

ఇక ష్ట్రానికి అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని 1.36 లక్షల కోట్ల నుండి 3.38 లక్షల కోట్లకు పెంపు. 

స్వయం సహాయక సంఘాల ద్వారా అందించే ఋణాలు 41.16 లక్షల మందికి అందించటం జరుగుతుంది. 

సభలో ఎంత గందరగోళం చెలరేగుతున్నా పట్టించుకోకుండా తన వంతు పాత్రను సమర్ధవంతంగానూ, సంపూర్ణంగానూ పోషించిన చిదంబరం తయారు చేసిన ఈ బడ్జెట్ కేవలం ఎన్నికల బడ్జెట్ అని విపక్షాలు విమర్శిస్తున్నాయి.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles