Parliament proceedings amidst protests

Parliament proceedings amidst protests, Union budget presentation, Union Finance Minister Chidambaram, Union budget 2014, Sonia Gandhi, Rahul Gandhi

Parliament proceedings amidst protests, Union budget presentation

అలలు ఆగేంతవరకూ సముద్రస్నానం ఆపితే ఎలా- కేంద్ర ప్రభుత్వ ధోరణి

Posted: 02/17/2014 11:59 AM IST
Parliament proceedings amidst protests

అలలు ఆగేంతవరకూ ఆగాలనుకుంటే ఇక సముద్రస్నానం చేసినట్లే అన్నట్లుగా పార్లమెంట్ లో సభ్యుల ఆందోళన ఆగిన తర్వాతనే సభను ముందుకు తీసుకెళ్దామనుకుంటే పుణ్యకాలం కాస్తా గడిచిపోతుందన్న ఉద్దేశ్యంతో సీమాంధ్ర ఎంపీలను బహిష్కరించినా ఆ స్థానంలో ఆందోళన చేస్తున్న సీమాంధ్ర మంత్రుల నినాదాల మధ్యనే కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం బడ్జెట్ ని పార్లమెంట్ లో ప్రవేశపెట్టటం, దాని మీద ప్రసంగించటం కూడా జరిగిపోతోంది.

మరో పక్క సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఆందోళన చేస్తున్న మంత్రుల వైపే చూస్తున్నారు.  కంటి చూపుతోనే నియంత్రించే సోనియా గాంధీ చూపులకు కూడా వెరవకుండా మంత్రులు ఆందోళన కొనసాగిస్తుంటే పార్లమెంట్ వ్యవహారాల మంత్రి కమలనాథ్, రక్షణ మంత్రి ఎకె ఆంటోనీ ఆ మంత్రులను బుజ్జగించే పనిలో పడ్డారు. 

కానీ కేంద్ర ప్రభుత్వం తన పని తాను చేసుకుపోతోంది.  ఎన్ని గొడవలు జరుగుతున్నా, ఆందోళనకారులంతా ఢిల్లీలోనే మకాం పెట్టినా, సొంత పార్టీ ఎంపీలు, మంత్రులు నిరసన గళాలను విప్పుతూ బడ్జెట్ ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నా సరే పార్లమెంటు కళ్ళకు గంతలు కట్టుకున్న గుర్రంలా ముందుకు దూకుతూనే ఉంది. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles