Seemandhra ministers for justice on t bill

seemandhra ministers for justice on t bill, Seemandhra ministers meet Advani, Chiranjeevi, Pallam Raju, Kavuri Sambasivarao, Purandheswarai

seemandhra ministers for justice on t bill, Seemandhra ministers meet Advani

బిల్లు మీద న్యాయం కోసం సీమాంధ్ర కేంద్ర మంత్రుల కృషి

Posted: 02/17/2014 11:19 AM IST
Seemandhra ministers for justice on t bill

ఈరోజు పార్లమెంటులో సమావేశాలు ప్రారంభమౌతూనే సమైక్యాంధ్ర తెలంగాణాలకు అనుకూలంగా జరుగుతున్న నినాదాల మధ్యనే గందరగోళం నడుమనే షెడ్యూల్ ప్రకారం ఆర్ధిక మంత్రి చిదంబరం బడ్జెట్ ని ప్రవేశపెట్టారు.  ఒక పక్క ఆందోళన నిరంతరం జరుగుతుండగానే బడ్జెట్ మీద చర్చలు ప్రారంభమయ్యాయి.  సీమాంధ్ర మంత్రులు కూడా స్పీకర్ వెల్ లోకి వెళ్ళారు.  సీమాంధ్ర ఎంపీలు మంత్రలు ఆగకుండా ఆందోళన చేస్తున్నారు.  హర్ష కుమార్ పాయింట్ ఆఫ్ ఆర్డర్ గురించి మాట్లాడగా, ఏ పాయింట్ ఆఫ్ ఆర్డర్ అని స్పీకర్ అని అడగ్గా రాష్ట్ర విభజన బిల్లు అని అనగా, ఇప్పుడు జరుగుతున్నది అది కాదని స్పీకర్, జరిగినదే సవ్యంగా జరగలేదని పార్లమెంట్ సభ్యులన్నారు.

హానరబుల్ మెంబర్స్, కావాలంటే నా ఛేంబర్ లోకి తర్వాత రండి కానీ ప్రస్తుతం లోక్ సభను సాగనివ్వండని, సీట్లలో కూర్చోండని, ఈ ఆఖరు లోక్ సభ సమావేశాలు ఇంకా కొన్ని రోజులే ఉన్నాయి కాబట్టి దయచేసి సహకరించి శాంతంగా సభను ముందుకు సాగనివ్వండి స్పీకర్ మళ్ళీమళ్ళీ అర్ధించారు.  

పార్లమెంటుకి రాక ముందు అద్వానీతో భేటీ అయిన సీమాంధ్ర మంత్రులు కావూరి సాంబశివరావు, పళ్ళం రాజు, చిరంజీవి, పురంధేశ్వరి, కోట్ల సూర్య ప్రకాశరెడ్డి తెలంగాణా బిల్లులో సవరణలను ప్రతిపాదించాలని కోరారు.  మంత్రలు ఎంపీల బహిష్కరణ గురించి కూడా ఆయనతో చర్చించారు.  సీమాంధ్ర ఎంపీలు లేకుండా వారి గైర్హాజరీలో వారి భవిష్యత్తు మీద చర్చ ఎలా జరుగుతుందని వారు ప్రశ్నిస్తూ ఈ విషయంలో జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించటానికి అద్వానీ ఇతర భాజపా నాయకుల సహకారం కావాలని కోరారు.  

పురంధేశ్వరి, చిరంజీవి, బాపిరాజు, హర్షకుమార్ లు స్పీకర్ వెల్ లోకి దూసుకెళ్ళి నినాదాలు చేస్తున్నారు.  ఎవరు విన్నా లేకున్నా మాకేంటి అన్నట్లుగా చిదంబరం తన బడ్జెట్ ప్రసంగాన్ని చదువుకుంటూ పోతున్నారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles