Pepper spray gets recognition in vijayawada

pepper spray gets recognition in Vijayawada, Vijayawada MP Lagadapati Rajagopal, Samaikyandhra protesters, Pepper spray in Parliamment

pepper spray gets recognition in Vijayawada, Lagadapati Rajagopal

మిరియాల పొడికి విజయవాడలో గిరాకీ

Posted: 02/14/2014 08:41 AM IST
Pepper spray gets recognition in vijayawada

నిన్న లోక్ సభ సమావేశాలలో మిరియాల పొడి స్ప్రే చేసి సభనంతా అతలాకుతలం చేసి యావద్భారత దేశాన్నీ ఆశ్చర్యంలో ముంచెత్తిన విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ చర్యకు ఆయన నియోజకవర్గంలో ఎవరూ ఆశ్చర్యపోలేదు సరికదా వివిధ రకాల బిరుదులతో వ్యాపార సంస్థల ప్రకటనలు కూడా టివిల్లో వెల్లువెత్తాయి.  ఆంధ్రా భగత్ సింగ్ అని, టైగర్ అని పులి అని వివిధ నామాలతో స్త్రోత్రం చేసాయి వాణిజ్య సంస్థలు. 

ఇది అని ప్రత్యేకంగా కాకపోయినా, ఆయనేదో చేస్తారని అందరూ ఊహిస్తూనేవున్నారు.  బిల్లు ఎందుకు ప్రవేశపెట్టామా అని తలలు పట్టుకుంటారని ముందుగానే అన్నారు లగడపాటి తలలు పట్టుకోవటమంటే ఆలోచనలు రాక ఏం చెయ్యాలో పాలుపోక తలపట్టుకుంటారని అందరూ అనుకున్నారు కానీ ఇలా ముక్కుల్లో ఘాటుతో ఊపిరాడక తలలు పట్టుకుంటారని ఎవరూ ఊహించలేదనుకోండి.

కానీ 2009 లో ఆయన విజయవాడలో అదృశ్యమై పోలీసు హెచ్చరికలను లెక్కచేయకుండా హైద్రాబాద్ లో నిమ్స్ హాస్పిటల్ లో ప్రత్యక్షమవటం రాష్ట్రప్రజలందరికీ గుర్తుంది.  అయితే ఈ సారి చేసిన చర్యను ఆయన ఆత్మ రక్షణార్థం చేసినట్లుగా సమర్థించుకుంటున్నా, ఇంకేమైనా ప్రజాస్వామ్య సిద్ధాంతాలకు అనుగుణంగా చేసుండాల్సింది అని ఆయనకు మద్దతుగా మాట్లాడేవాళ్ళలో కూడా చాలా మంది భావిస్తున్నారు.  ఆయన ఉద్దేశ్యం మంచిదే కానీ ఇలా అందరూ నిరసించే విధంగా చెయ్యకుండా ఉండాల్సిందంటూ సమైక్యాంధ్రవాదులు కూడా అభిప్రాయపడుతున్నారు. 

లగడపాటి చర్య వలన సమైక్యాంధ్ర వాదాన్ని దెబ్బ తీయవచ్చని కూడా సమైక్యాంధ్రవాదులు భావిస్తున్నారు.  దేశమంతా పార్టీలతో నిమిత్తం లేకుండా లగడపాటి చర్యను విమర్శించారు.  జాతీయ స్థాయిలో సమైక్యాంధ్ర పట్ల కొద్దోగొప్పో మంచి అభిప్రాయముంటే అది కాస్తా దీనితో తుడిచిపెట్టుకుపోయే అవకాశం ఉందంటున్నారు. 
ఎన్ని విమర్శించినా చివరకు ఆయన నియోజకవర్గంలో మాత్రం ఆయన్ని హీరోగా చూడటం విశేషం.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles