Bjp may get 227 seats survey says

BJP may get absolute majority with 227 seats, survey reports favor BJP, AIDMK party, Jaya Lalitha, Mulayam Singh Yadav SP, Mayavathi BSP

BJP may get absolute majority with 227 seats surveys say

భాజపా అధికారంలోకి వచ్చే అవకాశం

Posted: 02/14/2014 07:59 AM IST
Bjp may get 227 seats survey says

28 రాష్ట్రాలలో ఇండియా టివి, టైమ్స్ నౌ, సి వోటర్ 14 వేల మందితో మాట్లాడి చేసిన సర్వేల ప్రకారం వచ్చే ఎన్నికల్లో లోక్ సభలో మొత్తం 543 సీట్లకు గాను భారతీయ జనతా పార్టీ 227 సీట్ల సంపాదించి అధికారాన్ని చేజిక్కించుకుంటుందని తేలింది.  ప్రాంతీయ పార్టీలైన వైకాపా, తృణమూల్ కాంగ్రెస్, ఆల్ ఇండియా అన్నా డిఎమ్ కే, ఆమ్ ఆద్మీ పార్టీలు బాగా పుంజుకున్నాయి.  ఇక పోతే కాంగ్రెస్ పార్టీ మాత్రం 84 సీట్ల కంటే ఎక్కవ దక్కించుకోలేకపోతుందని సర్వే నివేదికలు తెలుపుతున్నాయి. 

అమెరికా కూడా భాజపా ప్రత్యేకంగా నరేంద్ర మోదీని ప్రసన్నం చేసుకోవాలని చూడటం కూడా ఈ సర్వేకి బలాన్ని చేకూరుస్తుంది.  ఇంతా సర్వే రిపోర్ట్ ఈ కింది విషయాలను తెలుపుతోంది.

ఆమ్ ఆద్మీ పార్టీ లోక్ సభకి 7 సీట్లను సంపాదించుకునే అవకాశం ఉంది.  తృణమూల్ కాంగ్రెస్ 24 సీట్లు, జయలలిత నాయకత్వంలో ఏఐడిఎమ్ కే 27 సీట్లను, లెఫ్ట్ ఫ్రంట్ 27, ములాయమ్ సింగ్ యాదవ్ సమాజ్ వాదీ పార్టీ 20, మాయావతి పార్టీ బిఎస్ పి 21, వైకాపా 13 సీట్లను సంపాదించుకుంటారు. 

అనుకుంటున్నట్టుగా 16 పార్టీలతో కలిసి ధర్డ్ ఫ్రంట్ ఏర్పడినట్లయితే లెఫ్ట్ ఫ్రంట్, ఏఐడిఎమ్ కే లతో కలిపి 128 సీట్లను సంపాదించే అవకాశం ఉంది. ఇక ప్రాంతీయ పార్టీలతో కలిసి ఫోర్త్ ఫ్రంట్ కూడా ఏర్పడితే 87 సీట్లు దక్కించుకునే అవకాశం కనపడుతోంది.

సర్వేలో ఆసక్తికరమైన విషయాలు- 2009 ఎన్నికల ఫలితాలతో పోలిస్తే కాంగ్రెస్ పార్టీ 117 సీట్లను పోగొట్టుకుంటుంది.  యుపిఏ 217 నుంచి 237 వరకు సీట్లను పొందితే, ఎన్ డి ఏ 91 నుంచి 111 సీట్లను మాత్రమే పొందగలిగే అవకాశం ఉంది. ఏఐడిఎమ్ కే ప్రస్తుతం 9 స్థానాలలో ఉండగా ఈ వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ 27 స్థానాలను దక్కించుకునే అవకాశం ఉంది. ములాయమ్ సింగ్ యాదవ్ కొన్ని స్తానాలను పొగొట్టుకోగా మాయావతి స్థానాల్లో మార్పులు ఉండకపోవచ్చు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles