Kiran kumar silent deeksha at jantar mantar

Kiran Kumar Silent Deeksha at Jantar Mantar, Chief Minister Kiran Kumar Reddy, PCC President Botsa Satyanarayana, Rajghat, Delhi Jantar Mantar

Kiran Kumar Silent Deeksha at Jantar Mantar

సిఎం మౌనదీక్షకు పలువురి సంఘీభావం

Posted: 02/05/2014 02:03 PM IST
Kiran kumar silent deeksha at jantar mantar

ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్సా సత్యనారాయణ, ఎంపీల సమేతంగా మౌనదీక్షను ప్రారంభించారు.  కేవలం ప్లకార్డులు మాత్రం చేతపట్టుకుని చేస్తున్న మౌనదీక్ష పలువురి దృష్టిని ఆకర్షిస్తోంది.  
మౌన దీక్షకు ముందు కిరణ్ కుమార్ రెడ్డి బస్ లో రాజ్ ఘాట్ కి వెళ్ళి మహాత్మాగాంధీకి నివాళులర్పించి అక్కడి నుండి జంతర్ మంతర్ లో దీక్షకు బయలుదేరారు.  బస్సు ఏపి భవన్ నుంచి బయలుదేరినప్పుడు తెలంగాణా మంత్రులు, శాసనసభ్యులు అక్కడ బస్సు ముందు బైఠాయించి ఆందోళన చేపట్టటంతో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది.  అందులో శ్రీధరబాబు, గీతారెడ్డి, డికె అరుణ, సునీతా లక్ష్మారెడ్డి, షబ్బీర్ అలీలున్నారు.  
దీక్షాస్థలికి సమైక్యవాదులు చేరుకుని రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ఆందోళన చేస్తూ నినాదాలు చేసి ఆ ప్రదేశమంతా హోరెత్తించారు.  మౌన దీక్షలో పాల్గొన్న ముఖ్యమంత్రికి మద్దతుగా సంఘీభావాన్ని తెలిపిన వారిలో కావూరి సాంబశివరావు, చిరంజీవి, కేవిపి రామచంద్రరావు, టి.సుబ్బిరామిరెడ్డి, ఆనం రామనారాయణ, పార్థసారధి, పురంధేశ్వరి తదితరులున్నారు.  కేంద్ర మంత్రులు పళ్ళం రాజు, కిళ్ళి కృపారాణి, జెడి శీలం, పనబాక లక్ష్మి, కిషోర్ చంద్ర దేవ్ మౌనదీక్షకు దూరంగా ఉన్నారు.  
-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles