Parliament adjourned till tomorrow amid protests

Parliament adjourned till tomorrow amid protests, Seemandhra protest in Parliament, BJP leader Sushma Swaratj, Shiromani Akali Dal, Rajiv Gandhi, Indira Gandhi

Parliament adjourned till tomorrow amid protests

పార్లమెంటులో సీమాంధ్ర సభ్యుల ఆందోళన, సభ రేపటికి వాయిదా

Posted: 02/05/2014 01:01 PM IST
Parliament adjourned till tomorrow amid protests

లోక్ సభ, రాజ్య సభల్లో ఈ రోజు సీమాంధ్ర నాయకులు చేసిన ఆందోళనలో రెండు సభలూ మధ్యాహ్నం వరకు వాయిదా పడ్డాయి.  12.00 గంటలకు తిరిగి మొదలైన రాజ్యసభ వెనువెంటనే మరో సారి 15 నిమిషాల వరకు వాయిదా వెయ్యవలసివచ్చింది. 

పార్టీలకు అతీతంగా సీమాంధ్ర నేతలు స్పీకర్ పోడియం దగ్గరకు దూసుకెళ్ళి పార్లమెంటుని సజావుగా సాగనివ్వలేదు.  జై సమైక్యాంధ్రా అని ప్లకార్డులను ప్రదర్శిచారు. 

అదే సమయంలో ఒక సభ్యుడు ఢిల్లీ లో హత్యగావించబడ్డ ఈశాన్య భారత వాసి గురించి మాట్లాడుతూ జాతి వివక్షను రూపుమాపాలని అన్నారు.  అదే సందర్భంలో శిరోమణి అకాలీ దళ్ సభ్యుడు ఇందిరా గాంధీ హత్య తర్వాత రాజీవ్ గాంధీ టివి లో మాట్లాడిన మాటలు, ఆ తర్వాత సిక్కుల మీద జరిగిన ఊచకోత, అందుకు బాధ్యులైన సజ్జన్ కుమార్, జగ్దీష్ టైట్లర్ మీద పెండింగ్ లో ఉన్న కేసుల గురించి మాట్లాడారు.  గందరగోళంలో లోక్ సభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది.

మధ్యాహ్నం లోక్ సభలో సుష్మా స్వరాజ్ ఢిల్లీలో చనిపోయిన అరుణాచల్ విద్యార్థి నిడో తానియమ్ ప్రస్తావన తీసారు.  అంతే కాకుండా మణిపూర్ మహిళల మీద అత్యాచారం జరిగిందని చెప్పిన సుష్మా స్వరాజ్ ఆ ప్రాంతం వాళ్ళంతా దేశం కోసం పోరాడినవారని, ముక్కులు పొడవుగా ఉన్నా చట్టిగా ఉన్నా అందరూ భారతీయులేనని అన్నారు.  దీన్ని పరిష్కరించేందుకు పాఠ్య భాగాల్లో ఈశాన్యదేశ వాసుల గురించి తెలియజేయాలని, వారిని ఢిల్లీలో హాస్టల్ లలో ఇతర విద్యార్థులతో పాటు నివసించే ఏర్పాట్లు చెయ్యాలని ఆమె అభిప్రాయపడ్డారు. 

అయితే ఈ చర్చ ఎక్కువగా ముందుకు సాగకుండానే 12.25 కే గందరగోళం మధ్యలో స్పీకర్ మీరా కుమార్ సభను రేపటికి వాయిదా వేసారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles