Delhi gurdwara management notice to congress party

Delhi Gurdwara Management notice to Congress party, Rahul Gandhi, 1984 Sikh Riots, Delhi Gurdwara Management Committee, Rahul Gandhi Gherao

Delhi Gurdwara Management notice to Congress party, Rahul Gandhi, 1984 Sikh Riots

కాంగ్రెస్ పార్టీకి 72 గంటల నోటీసిచ్చిన గురుద్వారా కమిటీ

Posted: 01/31/2014 05:11 PM IST
Delhi gurdwara management notice to congress party

రాహుల్ గాంధీ వ్యాఖ్యలు సిక్కుల గాయాన్ని కెలికినట్లయింది.  72 గంటల లోగా 1984 లో ఢిల్లీలో సిక్కుల మీద దాడి చేసిన కాంగ్రెస్ పార్టీ నిందితుల జాబితాను బయటపెట్టాలని ఢిల్లీ గురుద్వారా మేనేజ్ మెంట్ కమిటీ, శిరోమణి అకాలీ దళ్ బాదల్ నోటీసులు జారీచేసాయి. 

ఇందిరాగాంధీ హత్య తర్వాత ఢిల్లీలో సిక్కులకు వ్యతిరేకంగా చెలరేగిన అల్లర్లను ఉసిగొలిపిన కాంగ్రెస్ నాయకుల కొమ్ముకాస్తున్నారని సిక్కుల సంఘాలు కాంగ్రెస్ పార్టీని ఆరోపిస్తూ వస్తున్నాయి.  దీని మీద అమెరికా ఫెడరల్ కోర్టులో పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ మీద అభియోగం కూడా ఉంది. 

కాంగ్రెస్ భాజపా మీద ఆయుధంగా వాడుతూ వస్తున్న గుజరాత్ అల్లర్లతో ఢిల్లీ సిక్కుల మీద దాడులను పోలుస్తూ మాట్లాడిన రాహుల్ గాంధీ మాటలు అగ్నిలో ఆద్యం పోసినట్లుగా సిక్కు సంఘాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. 

ఇచ్చిన నోటీసు గడువులోపులో నేరస్తులైన కాంగ్రెస్ పార్టీ నాయకుల పేర్లు బయటపెట్టకపోతే రాహుల్ గాంధీని ఘెరావ్ చేస్తామని హెచ్చరించారు సిఖ్ గురుద్వారా యాజమాన్య సభ్యులు. 

Related article

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles