Rahul gandhi bought problems

Rahul Gandhi bought problems, 1984 Sikh riots, Indira Gandhi, Sikh communities, Sikh protests, Indira Gandhi assasination

Rahul Gandhi bought problems, 1984 Sikh riots, Indira Gandhi

రాహుల్ గాంధీ కొనితెచ్చుకున్న ముప్పు

Posted: 01/30/2014 03:05 PM IST
Rahul gandhi bought problems

రాహుల్ గాంధీని ప్రధాన మంత్రి అభ్యర్థిగా చెప్పకనే చెప్తున్న కాంగ్రెస్ పార్టీ టివి ఛానెల్స్ లో రాహల్ ని కీర్తిస్తూ ప్రకటనలను గుప్పిస్తోంది.  అయితే ఒక టివి ఛానెల్ లో మాట్లాడుతూ రాహుల్ గాంధీ 30 సంవత్సరాల క్రితం ఢిల్లీలో సిక్కల మీద జరిగిన మారణహోమం ప్రస్తావన తీస్తూ, ఆ సందర్భంలో ప్రభుత్వం తీరుకి, 2002 లో గుజరాత్ లో జరిగిన గోధ్రా అల్లర్ల తర్వాత అక్కడి ప్రభుత్వం తీరుకీ మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఎత్తి చూపించే ప్రయత్నంలో అనవసరంగా ఆ వివాదాన్ని మరోసారి తెరపైకి తెచ్చినట్లయింది. 

ఢిల్లీలో అఖిలభారత కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఎదురుగా నిరసనలు తెలియజేస్తూ ఆందోళనకు దిగిన సిఖ్ సేవా సంస్థ సిక్కుల ఊచకోత పట్ల నిందితులైన కాంగ్రెస్ నాయకుల పేర్లను బయట పెట్టాలని రాహుల్ గాంధీని కోరింది.  వందలాది మంది సిక్కులు అక్బర్ రోడ్ మీద కాంగ్రెస్ పార్టీ దిష్టి బొమ్మలను తగులబెడుతూ, మానని గాయాల మీద ఊరగాయ రాసినట్లుగా ప్రవర్తిస్తున్నారంటూ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేసారు. 

రాహుల్ గాంధీ మాట్లాడుతూ తాను ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీల కానీ రాజకీయాలలో కానీ లేనని చెప్పి అంతటితో ఊరుకోకుండా, కొందరు కాంగ్రెస్ నాయకుల హస్తమైతే ఉందని అయితే వాళ్ళ మీద చట్టరీత్యా విచారణ కొనసాగుతోందని అనటంతో ఇంకా రెచ్చిపోయిన సిక్కు బృందాలు, అలా అయితే రాహుల్ గాంధీకి వాళ్ళెవరో తెలుసన్నమాట.  వాళ్ళ పేర్లను సిబిఐ కి తెలియజేయాలి అంటూ ఆందోళన చేసారు. 

ఒట్టిగా పెదాల మీది నుంచి మాట్లాడటం కాదు సిక్కుల మీద జరిగిన అన్యాయం మీద సిట్ తో విచారణ సాగించాలని 25 సంవత్సరాలుగా కోరుతున్నాం ఏదీ మరి కాంగ్రెస్ చేసింది అంటూ నిలదీసారు ఆందోళనకారులు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles