Special assembly session in indira gandhi indoor stadium

Jan lokpal bill by AAP in Delhi, Special assembly session in Indira Gandhi Indoor Stadium, Delhi Cabinet approves Janlokpal bill

special assembly session in Indira Gandhi Indoor Stadium to pass Janlokpal Bill

ఇందిరాగాంధీ స్టేడియంలో ప్రత్యేక శాసనసభ

Posted: 01/31/2014 04:42 PM IST
Special assembly session in indira gandhi indoor stadium

ఫిబ్రవరి 16 న ఢిల్లీ ఇందిరా గాంధీ స్టేడియంలో ఆఆపా నిర్వాహకుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవల్ ప్రత్యేక శాసనసభను నిర్వహించనున్నట్లుగా వెల్లడించారు. 

అవినీతిలో కూరుకుపోయిన రాజకీయనాయకులను శిక్షించటం కోసం జన్ లోక్ పాల్ బిల్లను ఢిల్లీ శాసనసభలో ప్రవేశపెట్టాలని ఈ రోజు జరిగిన క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోవటం జరిగింది.  ఫిబ్రవరి 13 నుంచి 16 వరకు జరగనున్న అసెంబ్లీ సమావేశాలలో ఆఖరి రోజు సమావేశాన్ని ఇందిరా గాంధీ స్టేడియంలో నిర్వహించనున్నట్లు మంత్రి మనీష్ సిసోడియా తెలియజేసారు. 

అవినీతికి వ్యతిరేకంగా అన్నాహజారే ప్రారంభించిన ఉద్యమం మొదలైన రామ్ లీలా గ్రౌండ్స్ లో జన్ లోక్ పాల్ బిల్ ని ఆమోదింపజేయాలని ముందు అనుకున్నా భద్రతా సమస్యలను దృష్టిలో పెట్టుకుని అందుకు అనుమతినివ్వబోమని ఢిల్లీ పోలీసులు తెలియజేసారు. 

జన్ లోక్ పాల్ బిల్లు మీద క్యాబినెట్ లో చర్చ జరిగిపోయిందని, దాన్ని శాసనసభలో ప్రవేశపెట్టటమే మిగిలుందని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. 

అవినీతికోరుల మీద దర్యాప్తులను పూర్తి చెయ్యటానికి ఆరు నెలల గరిష్ట సమయాన్ని విధించాలని ఆఆపా భావిస్తోంది.  అవినీతిని అంతమొందిస్తానని చేసిన ఎన్నికల వాగ్దానానికి ఇది ఆఆపా వేస్తున్న తొలి అడుగు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles