Seemandhra mlas strategy

Seemandhra MLAs strategy, AP State reorganization bill rejected, Chief Minister Kiran Kumar Reddy, Speaker Nadendla Manohar, TRS leader Harish Rao

Seemandhra MLAs strategy, AP State reorganization bill rejected

సీమాంధ్ర శాసనసభ్యుల పార్టీలకతీతమైన వ్యూహం

Posted: 01/31/2014 10:44 AM IST
Seemandhra mlas strategy

యుద్ధంలో జరిగే వ్యూహాల మాదిరిగానే గురువారం శాసనసభలోనూ తెలంగాణా సీమాంధ్ర శాసనసభ్యుల మధ్య విభజన బిల్లు తిరస్కరణ తీర్మానాన్ని గెలిపించటానికి భౌతికమైన చర్యల వ్యూహరచన జరిగింది. 

రాష్ట్ర విభజన బిల్లుని తిరస్కరించే తీర్మానం మీద చర్చలు ఓటింగ్ లను అడ్డుకోవటానికి తెలంగాణా సభ్యులు ముందుగానే నిర్ణయం తీసుకున్నారు అందుకు తయారుగానే ఉన్నారు.  దీనికి ధీటుగా ఆంధ్రప్రాంత సభ్యులు కూడా ధీటుగా ఎదుర్కోవటానికి ప్రణాళిక వేసుకున్నారు. 

ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభమైన శాసనసభ గందరగోళంలో వాయిదా పడింది.  తర్వాత 11.00 గంటలకు తిరిగి ప్రారంభమైన సభ మహాత్మా గాంధీకి ముందుగా నివాళులర్పించింది, వెనువెంటనే వాయిదా పడింది. 

ఈ లోపులో తెలంగాణా నాయకులకు, బిల్లు మీద చర్చకు మరో వారం రోజుల గడువు లభిస్తోందన్న వార్త చేరుకుంది.  మధ్యాహ్న 1.30 కల్లా రాష్ట్రపతి నుంచి గడవు పొడిగింపుకి ఉత్తర్వులు రాబోతున్నాయని వార్తనందుకున్న తెలంగాణా నాయకులు దాన్ని అడ్డుకుని సభను 12.00 గంటలకే నిరవధిక వాయిదా వేసేలా స్పీకర్ మీద ఒత్తిడి తేవాలని నిర్ణయించుకున్నారు. 

సభ వాయిదా పడ్డప్పుడు అందరూ బయటకు వెళ్ళారు కానీ సీమాంధ్ర ప్రాంత తెలుగు దేశం పార్టీ, వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు అక్కడే ఉండిపోయి వ్యూహరచన చేసారు.  తెదేపా నాయకు పయ్యావుల కేశవ్ బయటకు పోయి కాంగ్రెస్ పార్టీ సభ్యు ద్రోణంరాజు శ్రీనివాస్ ని కూడా లోపలికి పిలుచుకునివచ్చారు.  అందరూ కలిసి సభాపతి దగ్గరకు తెలంగాణా నాయకులు పోకుండా ఉండటానికి యుద్ధ వ్యూహమే పన్నారు.  ఆ వ్యూహం ఇది-

స్పీకర్ కి ఎదురుగా ముందు వరసలో మార్షల్స్, ఆ తర్వాత వరుసలో మహిళా తెదేపా సభ్యులు ఆ వెనుక రెండవ వరసలో తెదేపా వైకాపా సభ్యులు నిలబడ్డారు.  మూడవ వరసలో కాంగ్రెస్ పార్టీతో సహా అన్నిపార్టీలకు చెందిన సీమాంధ్ర సభ్యులున్నారు.  ముఖ్యమంత్రికి చుట్టూ ఆరుగురు మార్షల్స్ రక్షణగా నిలబడ్డారు.  ఈ విధమైన పద్మవ్యూహం పన్ని తిరిగి సభ మొదలయ్యేంత వరకూ అందరూ అలాగే నిలబడిపోయారు. 

ఇక సీమాంధ్ర శాసన సభ్యులంతా ముందుగా వేసుకున్న వ్యూహం ప్రకారం దడికట్టటమే కాకుండా ముందుకు చొచ్చుకుని వచ్చే వాళ్ళని వెనక్కి లాగటానికి, అవసరమైతే వారిని ఆలింగనం చేసుకుని నిలువరించటానికి ఈ విధంగా మూడంచలుగా తయారుగా ఉన్నారు. 

శాసన సభ గంట మోగింది, తెలంగాణా సబ్యులు లోపలికి వచ్చి అక్కడి దృశ్యాన్ని చూసి ఖంగు తిన్నారు.  అయినా ముందుకు చొచ్చుకుని వచ్చారు.  హరీశ్ రావు వాళ్ళ మీది నుంచి పైకి ఎగిరి మైక్ లాక్కోవటానికి పేపర్లను అందుకుని చిందరవందర చెయ్యటానికి ప్రయత్నించారు.  అయితే మహిళా ఎమ్మల్యే ఆయన కాలు పట్టుకుని లాగివెయ్యటంతో హరీష్ రావు కిందపడిపోయారు.  లేవదీసిన ఆయనను టి.రామారావు ఆలింగనం చేసుకుని ఒడిసిపట్టుకున్నారు. 

కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముందుకు తోసుకెళ్ళే ప్రయత్నం చెయ్యగా కారుమూరు నాగేశ్వరరావు ఆయనను గట్టిగా కౌగిలించి పట్టుకున్నారు.  ఇంకా కొందరు తెలంగాణా సభ్యులు సభాపతిని ప్రసంగించకుండా అడ్డుకోవాలని ప్రయత్నం చెయ్యగా కంచుకోటలా ఉన్న సీమాంధ్ర నాయకులు వాళ్ళని అడ్డుకున్నారు.

మంత్రులు మాత్రం తమ తమ సీట్లలో కూర్చుని జరుగుతున్న హై డ్రామాను చూస్తుండిపోయారు.  సభాపతి నాదెండ్ల ఈ గందరగోళంలోనే మూజుబాణీ వోటు కి పిలుపునిచ్చి ముఖ్యమంత్రి తీర్మానాన్ని ఆమోదించినట్లుగానూ సభ నిరవధికంగా వాయిదా పడిందని ప్రకటించి సభనుంచి వెళ్ళిపోయారు. 

భౌతికంగా అడ్డుకోవటం జరిగినా, ఒకరినొకరు తిట్టుకోవటం కానీ మరేవిధమైన అవమానకరమైన సంబోధన లేకుండా అన్నా అంటూ ఆలింగనం చేసుకోవటంతో ఘర్షణ పెరగలేదు.  అయితే జరిగిన విషయమంతా అర్థమైన తర్వాత, తెలంగాణా రానీ మీ సంగతి చూస్తాం అన్నారు తెలంగాణా సభ్యులు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles