Congress core committee to discuss on t bill

Congress Core Committee to discuss on T Bill, AP Stat Reorganization Bill 2013, Rahul Gandhi Core committee to discuss T Bill

Congress Core Committee to discuss on T Bill, Rahul Gandhi

కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశంలో విభజన బిల్లు

Posted: 01/31/2014 11:44 AM IST
Congress core committee to discuss on t bill

ఈరోజు ఉదయం ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ నివాసంలో కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం ప్రారంభమైంది. 

ఈ సమావేశంలో ప్రధానంగా రాబోయ్ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల మీద చర్చించుకోవటంతోపాటు గురువారం నాడు ఆంధ్రప్రదేశ్ ఎసెంబ్లీలో జరిగిన పరిణామాలు, దానికనుగుణంగా రాష్ట్ర విభజన బిల్లు మీద ప్రభుత్వం తీసుకోవలసిన చర్యుల గురించి కూడా సమాలోచన చేస్తారు. 

ఈ కోర్ కమిటీలో పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా హాజరయ్యారు 

ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి చేసిన రాజీనామా కూడా సమావేశంలో చర్చల్లో చోటుచేసుకోనుంది. 

ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లుకి సంబంధించి ముఖ్యమంత్రి ఆ బిల్లుని తిరస్కరించటానికి తీర్మానం చెయ్యటం, ఆ తీర్మానం మీద ముజుబాణీ వోటింగ్ చేపట్టి దాన్ని ఆమోదించటం దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం దాని మీద న్యాయసంబంధిత సమస్యలు రాకుండా ఏవిధంగా ముందుకు తీసుకెళ్ళాలన్నది చర్చల్లోకి రాబోతోంది.  ఇంతవరకు బిల్లు విషయంలో ఏ అవరోధాలనూ, ఆందోళనలనూ పట్టించుకోకుండా ముక్కుకి సూటిగా పోతూ ఎలాగైనా తెలంగాణాకు ప్రత్యేక రాష్ట్రాన్నిస్తామని ధీమాగా చెప్తూ వస్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత పరిస్థితుల్లో ఎలా చెయ్యాలా అని ఆలోచించే అవసరమైతే కలిగింది. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles