Subsidy gas cylinders raised

subsidy gas cylinders raised, Subsidy gas 12 cylinders yearly, Rahul Gandhi request to Manmohan Singh, Government Ordinance ridiculed by Rahul, Rahul Congress PM Candidate

subsidy gas cylinders raised from 9 to 12, Rahul Gandhi request to Manmohan Singh

రాయితీ వంట గ్యాస్ సిలెండర్ల పెంపు అధికారికంగా

Posted: 01/30/2014 06:12 PM IST
Subsidy gas cylinders raised

చివరకు ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఒత్తిడికి తలవొగ్గి సబ్సిడీలో కనెక్షన్ కి సంవత్సరానికి ప్రస్తుతం 9 వంట గ్యాస్ సిలెండర్లు ఇస్తున్న హద్దుని 12 కి పెంచింది.   దానితో పాటుగా సబ్సిడీ సొమ్ముని ఆధార్ లింక్ తో గ్యాస్ వినియోగదారుని బ్యాంక్ ఖాతాలో నేరుగా జమకట్టే  విధానాన్ని ప్రస్తుతానికి పక్కకు పెట్టేస్తోంది.  అంటే రాయితీ మినహాయింపు సొమ్మునే చెల్లించే విధానాన్ని పూర్వకాలంలాగా తిరిగి తీసుకువస్తోంది.  ఇక, మొత్తం సొమ్ము చెల్లించి ఖాతాలో రాయితీ సొమ్ముని తిరిగి పొందవలసిన అవసరం ఇప్పుడు ఉండదు.

దీనివలన ప్రభుత్వానికి అదనంగా రూ.5000 కోట్లు రాయితీ రూపంలో భారం పడబోతోందని చమురు శాఖా మంత్రి వీరప్ప మొయిలీ అన్నారు. 

అయితే ఈ విధానం వచ్చే ఆర్థిక సంవత్సరం అంటే ఏప్రిల్ 1 నుంచి వర్తిస్తుంది.  ఈ లోపులో ఫిబ్రవరి మార్చి నెలల్లో ప్రస్తుతం ఉన్న 9 గ్యాస్ సిలెండర్ల మీద అదనంగా మరో సిలెండరు కూడా వినియోగదారులు తీసుకోవచ్చునని కూడా మొయిలీ అన్నారు.

ఆధార్ కార్డ్ లింక్ తో వినియోగ దారుని ఖాతాలో నేరుగా జమకట్టే విధానాన్ని పక్కకు పెట్టటానికి కారణం, పథకాన్ని అమలుపరచటంలో కొన్ని సాధకబాధకాలు వినియోగదారుల అభియోగాల రూపంలో తమ దృష్టికి వచ్చాయని, వాటిని పరిశీలించే ఉద్దేశ్యంతో దాన్ని కొన్నాళ్ళు హోల్డ్ లో పెట్టటం జరిగిందని మొయిలీ అన్నారు.

అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశంలో ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వంట గ్యాస్ రాయితీలో ఇస్తున్న 9 సిలెండర్ల నుంచి సంవత్సరానికి 12 సిలెండర్లకు పెంచాలని ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ ని కోరారు.  దాని ప్రభావమే ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం.  ఇంతకు ముందు కూడా ప్రభుత్వం ఇచ్చిన ఆర్డినెన్స్ చిత్తు కాగితంతో సమానమని వ్యాఖ్యానించగా ప్రభుత్వం దాన్ని హడావిడిగా రద్దు చేసింది.  అది నేరారోపణలో ఉన్న ప్రజాప్రతినిధుల మీద అనర్హులని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుకి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం చేసిన ఆర్డినెన్స్. 

పై రెండు సంఘటనల ద్వారా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీకి ఇచ్చే విలువ, ఆయన ప్రధానమంత్రి పదవికి చేరుకోవటానికి బాటలు వెయ్యటానికి చేస్తున్న కృషి అర్థమౌతున్నాయి.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles