Kcr leaves for delhi on telangana bill

KCR leaves for Delhi AP State Reorganization Bill 2013, Telangana Bill, AP Assembly rejects T Bill

KCR leaves for Delhi AP State Reorganization Bill 2013, Telangana Bill

ఢిల్లీ పోతా, తెలంగాణతో వస్తా- కెసిఆర్

Posted: 01/30/2014 05:27 PM IST
Kcr leaves for delhi on telangana bill

తెలంగాణా రాష్ట్రం కోసం ఆందోళన చెందవద్దని, తాను రేపు ఢిల్లీకి పోతున్నానని, తిరిగి వచ్చేది తెలంగాణాతోనేనని తెలంగాణా రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖర రావు తెలంగాణా ప్రాంత ప్రజలనుద్దేశించి మీడియా సమావేశంలో అన్నారు.

మెజారిటీతో రాష్ట్ర విభజన జరిగితే ఏ ఒక్క కొత్త రాష్ట్రమూ ఏర్పడివుండేది కాదని, శాసన సభ కేవలం అభిప్రాయం చెప్పటం కోసం మాత్రమే ఉందని, అందువలన రాష్ట్రం ఏర్పాటు చేసే అధికారం కేవలం కేంద్ర ప్రభుత్వానికే ఉందని కెసిఆర్ అన్నారు. 

ఇక ఇక్కడ పని పూర్తయిందని, రాష్ట్రంలో విభజన విషయంలో సంక్షోభం వచ్చినప్పుడు దాన్ని పరిష్కరించవలసింది కేంద్రంలోనే కాబట్టి ఇక జరగవలసినదంతా ఢిల్లీలోనేనని చెప్పిన కెసిఆర్ పార్లమెంటులో ప్రవేశపెట్టేదే తుది బిల్లు అవుతుందని, అటువంటి తెలంగాణా రాష్ట్ర అవతరణ బిల్లుకి ఆమోదం తప్పక లభిస్తుందని ఆయన ధీమాను వ్యక్తపరచారు.  అయితే ప్రస్తుత బిల్లులో ఉన్న కొన్ని లోపాల సవరణలను కూడా తాను అక్కడ ప్రతిపాదిస్తానని కూడా కెసిఆర్ అన్నారు. 

బిల్లు మీద వాడి వేడి చర్చలు, ఆందోళనలు జరిగిన తర్వాత రాష్ట్రపతి గడువుని కూడా వారం రోజుల పెంచిన తర్వాత, మరో మూడు వారాల గడువు ఇంకా కావాలని కోరిన తర్వాత, ఈరోజు శాసనసభలో తెలంగాణా బిల్లుని తిరస్కరించటానికి ముఖ్యమంత్రి సభలో వేసిన తీర్మానం ఆమోదించబడింది.  బిల్లంతా తప్పుల తడకని దానికి సాధికారత లేదని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బిల్లుని తిరస్కరించారు.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి,  ప్రతిపక్షనాయకుడు చంద్రబాబు నాయుడు వారి స్థాయికి తగ్గట్టుగా ప్రవర్తించలేదని కెసిఆర్ విమర్శించారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles