Jayalalitha has to face trial for non filing of it returns

Jayalalitha has to face trial for non filing of IT returns, Supreme court verdict on Jayalalitha, Shashi Enterprises of Jayalalitha

Jayalalitha has to face trial for non filing of IT returns

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు ఎదురుదెబ్బ

Posted: 01/30/2014 03:43 PM IST
Jayalalitha has to face trial for non filing of it returns

మూడు సంవత్సరాల ఆదాయ పన్ను రిటర్న్స్ ఫైల్ చెయ్యనందుకు జయలలిత విచారణను ఎదుర్కోవలసివుంటుంది.  జస్టిస్ కెఎస్ రాధాకృష్ణన్ నేతృత్వంలో విచారణ చేసిన సుప్రీం కోర్టు బెంచ్ ఈ కేసుని నాలుగు నెలలలోపులో పూర్తి చెయ్యాలని ట్రయల్ కోర్టుని ఆదేశించింది.

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత తన స్నేహితురాలు శశికళతో భాగస్వామ్యంలో నడిపిన శశి ఎంటర్ ప్రైజెస్ లో జరిగిన లావాదేవీల విషయంలో ఆదాయ పన్ను శాఖకు 1991-92, 1992-93, 1993-94 ఆర్థిక సంవత్సరాలకు సంస్థ తరఫునుంచి కానీ, ఆమె కానీ ఆమె భాగస్వామిని శశికళ కాని రిటర్న్స్ ఫైల్ చెయ్యలేదు. 

ఆదాయమే లేనప్పుడు ఆదాయపన్ను ఎలా ఉంటుందని జయలలిత చేసిన వాదనను చెన్నై ఆర్థిక నేరాల న్యాయస్థానం తిరస్కరించింది.  ఆదాయ పన్ను రిటర్న్ ఫైల్ చెయ్యకపోవటమే నేరం కనుక దాని పర్యవసానాలను ఎదుర్కోవలసిందేనని తేల్చి చెప్పింది.  దానిమీద హైకోర్టు కి అప్పీల్ చెయ్యగా హైకోర్టు కూడా ఆర్థిక నేరాల న్యాయస్థానం తీర్పుకి మద్దతు తెల్పుతూ విచారణను ఎదుర్కోవలసిందేనని చెప్పింది. 

ఈరోజు సుప్రీం కోర్టు కూడా హైకోర్టు తీర్పుని సమర్ధించింది. దీనితో జయలలిత ఆదాయ పన్ను శాఖ నుంచి వచ్చిన అభియోగానికి కోర్టులో విచారణను ఎదుర్కోవలసివస్తోంది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles