Diesel driven bike from hero motocorp

diesel driven bike from Hero Motocorp, RNT from hero, Scooter Leap from Hero Motocorp, 150 CC Hero RNT bike, Hero hybrid scooter Leap

diesel driven bike from Hero Motocorp, RNT from hero, Scooter Leap from Hero Motocorp

ఎన్నో కొత్త ఫీచర్లతో హీరో కంపెనీ వారి డీజిల్ బైక్

Posted: 01/30/2014 02:33 PM IST
Diesel driven bike from hero motocorp

ద్విచక్ర వాహన ఉత్పాదనలో సంఖ్యపరంగా ప్రపంచంలోనే అగ్రగామియైన హీరో మోటాకార్ప్ సంస్థవారు డీజిల్ తో నడిచే ద్విచక్రవాహనాలను మార్కెట్ లోకి తీసుకొస్తున్నారు.

150 సిసి ఇంజన్ తో మోటార్ బైక్స్ లో విప్లవం తీసుకురాగలిగే ఉత్పాదన చేసిని హీరో కంపెనీవారు బుధవారం నాడు దాన్ని ఆవిష్కరించారు.  ఆర్ఎన్ టి అని పేరు పెట్టిన ఈ ద్విచక్రవాహనం మీద సవారీ ఎస్యువి కార్ల మీద ప్రయాణమంత సుఖప్రదంగా ఉంటుందంటున్నారు. 

మోటార్ సైకిల్ చరిత్రలోనే చూడని మరెన్నో విశేషాలు ఈ ఆర్ఎన్ టి లో ఉన్నాయన్నారు హీరో మోటాకార్ప్ ఎమ్ డి, సిఇవో పవన్ ముంజాల్.  150 సిసి డీజిల్ ఇంజన్ తో పాటు ఈ ద్విచక్రవాహనంలో కూర్చునే సీటు, కాళ్ళు పెట్టుకునే జాగా, సామాన్లు పెట్టుకునే స్థలం సౌకర్యవంతంగా వెడల్పు ఉంటాయని, పక్కన ఉండే రాక్స్ ని మడిచే విధంగా ఉంటాయని ఆయన అన్నారు. 

మరో విశేషం, ద్విచక్ర వాహనంలో మొదటిసారి ఇందులో ముందు చక్రానికి కూడా బ్యాటరీతో ముందుకు నడిపే సౌకర్యం ఆప్షనల్ గా ఉంటుంది.  ఇది జీప్, ట్రక్ లలో ఉండే లోడ్ గేర్ లాంటిది.  రోడ్డు కండిషన్ బాగోలేనప్పుడు దీన్ని ఉపయోగించవచ్చు. 

అంతేకాదు, నగరంలో నడుపుతున్నప్పుడు కావాలంటే వెనక చక్రాల ఇంజిన్ ను ఆఫ్ చేసి ముందు చక్రాలకున్న బ్యాటరీ కనెక్షన్ తోనే నడపవచ్చు.  దానితో డీజిల్ ఆదా అవుతుంది. 

దీనితోపాటుగా హీరో కంపెనీ వారు మరో హైబ్రీడ్ స్కూటర్ లీప్ ని కూడా ఆవిష్కరించారు.  అది ఫ్యూయల్ తోనూ బ్యాటరీతోనూ నడిచే ద్విచక్రవాహనం.  ఇందులో 6 స్పీడ్ల గేర్ ట్రాన్స్ మిషన్ ఉంటుంది.  ట్యాంక్ ఫుల్ చేసుకుని బ్యాటరీని ఛార్జ్ చేసుకుంటే 340 కిలోమీటర్లు ప్రయాణం చెయ్యవచ్చని అన్నారు పవన్ ముంజాల్.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles