Kiran kumar reddy challeges central govt

Kiran Kumar Reddy challeges Central Govt, Chief Minister Kiran Kumar Reddy, AP State Reorganization Bill, Telangana Bill, State bifurcation

Kiran Kumar Reddy challeges Central Govt

దమ్ముంటే ఈ బిల్లుని ఇలాగే పార్లమెంట్ లో పెట్టండి చూద్దాం

Posted: 01/29/2014 04:29 PM IST
Kiran kumar reddy challeges central govt

రాష్ట్ర పునర్విభజన బిల్లు మీద ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలను చేసారు. 

శాసన సభలో తన కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో సమావేశమైన కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్రానికి పంపించిన ఈ బిల్లును దమ్ముంటే ఇలాగే పార్లమెంటులో ప్రవేశపెట్టమని, అలా చేసినట్లయితే, అందుకు పార్లమెంటు అనుమతించినట్లయితే తాను ముఖ్యమంత్రి పదవి నుంచే కాదు రాజకీయాల నుంచి కూడా వైదొలుగుతానని అన్నారు.

తన తరఫు నుంచి బిల్లు మీద ఆక్షేపణలను తెలియజేస్తూ తాను రాష్ట్రపతి నుంచి మూడువారాల గడువు అడిగింది  కేవలం ఆ బిల్లులోని లోపలనన్నిటినీ ఎత్తి చూపటానికేనన్నారు కిరణ్ కుమార్.  సభకు ఎలాంటి అధికారం లేదు, ఇది పార్లమెంటు చెయ్యవలసిన పనే అని అంటున్న వారు ఓటింగ్ కి ఎందుకు భయపెడుతున్నారు, అసలు ఇక్కడకు పంపకుండా నేరుగానే పార్లమెంటులో ప్రవేశపెట్టివుండవచ్చుగా అని ఆయన ప్రశ్నించారు.

తనకు రాష్ట్ర ప్రజలంతా సమానమేనని, తాను విభజనకు పూర్తిగా వ్యతిరేకమని అన్న కిరణ్ కుమార్ రెడ్డి ఏ ఉద్దేశ్యంతో విభజన బిల్లుని తయారు చేసారో చెప్పకుండా    అభిప్రాయం చెప్పమంటే ఈ సభ దేనిమీద చెప్తుందంటూ ప్రశ్నించారు.   అదీ గాక సభలో ఇంతవరకు 86 మందే మాట్లాడారు.  ప్రజాప్రతినిధులంతా దీనిమీద అభిప్రాయం చెప్పకపోతే అది రాష్ట్ర ప్రజల అభిప్రాయమెలా అవుతుంది అన్నారాయన.  సభ్యులు మొత్తం 9024 సవరణలు ప్రతిపాదించినప్పుడు దీని మీద చర్చ జరగకుండా ఎలా పంపిస్తాము అని అడిగారాయన. 

మిగతా రాష్ట్రాలలోని విభజన ప్రక్రియ గురించి మాట్లాడుతూ ఆ రాష్ట్రాలలోని పరిస్థితికి మన రాష్ట్రంలో పరిస్థితికి చాలా తేడా ఉందని, అక్కడ జరిగినట్లుగా ఇక్కడ జరగటం వీలు కాని పనని ఆయన అన్నారు. 

అడిగిన గడువు ఇస్తారో లేదో తెలియదు కానీ కేంద్ర ప్రభుత్వం నిజంగా ఈ బిల్లుని యథాతథంగా పార్లమెంటులో ప్రవేశపెట్టమనండి చూద్దాం అంటూ సవాల్ విసిరారు ముఖ్యమంత్రి.  పార్లమెంటు దీన్ని ఇదే స్థితిలో ఆమోదించదని, అలా ఆమోదించినట్లయితే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని కిరణ్ కుమార్ రెడ్డి ఆత్మ విశ్వాసంతో చెప్పారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles