Wanted engineers in bel

Wanted Engineers in BEL, BEL wants Electronic Mechanical Engineers,

Wanted Engineers in BEL, BEL wants Electronic Mechanical Engineer

భారత్ ఎలక్ట్రానిక్స్ లో ఇంజినీర్ల అవసరం

Posted: 01/29/2014 03:25 PM IST
Wanted engineers in bel

డిఫెన్స్ కోసం ఎలక్ట్రానిక్ ఉత్పాదనలు చేసే భారత్ ఎలక్ట్రానిక్స్ లో బెంగళూరు యూనిట్ కోసం సంవత్సర కాలం కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచెయ్యటానికి ఎలక్ట్రానిక్, మెకానికల్ ఇంజనీర్ల అవసరం ఉందంటూ ప్రకటన చేసింది. 

విద్యార్హతలు – బిఇ లేక బిటెక్ డిగ్రీ
(ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, టెలి కమ్యూనికేషన్ లేక మెకానికల్ లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేక విద్యా సంస్థనుంచి)

వయో పరిమితి – 1.1.2014 నాటికి 25 సంవత్సరాలకు మించరాదు.

వేతనం – అభ్యర్ధుల అనుభవాన్ని బట్టి నెలకు అన్నీ కలిపి కన్సోలిడేటెడ్ జీతంగా రూ.12000 నుంచి రూ.15000 మధ్య ఉంటుంది. 

కాంట్రాక్ట్ వ్యవధి – ఉద్యోగంలో చేరిన దగ్గర్నుంచి ఒక సంవత్సర కాలం వరకు.  అవసరాన్నిబట్టి కాంట్రాక్ట్ కాలాన్ని పొడిగించవచ్చు. 

నిర్వహించవలసిన విధులు –  కస్టమర్ ఎలక్ట్రానిక్స్ లేదా టెలికమ్యూనికేషన్ ఇంజినీర్లకు - డిజిటల్ కమ్యూనికేషన్ సిస్టమ్, రేడియో ఎక్విప్ మెంట్, సిస్టమ్స్ పరీక్షణ, మార్కెటింగ్. మెకానికల్ ఇంజినీర్లకు- కొనుగోళ్ళు, ప్రొడక్షన్ కంట్రోల్, క్వాలిటీ కంట్రోల్.

అనుభవం – ఇంజినీరింగ్ ఇండస్ట్రీలో పై విధులలో కనీసం 6 నెలల అనుభవం లేదా భారత్ ఎలక్ట్రానిక్స్ లో ఒక సంవత్సర కాలం అప్రెంటిస్ గా పనిచేసిన వారికి ప్రాధాన్యత.

అభ్యర్థుల ఎంపిక

రాత పరీక్ష, ఆ తర్వాత అదే రోజు కానీ లేక మరో రోజు కాని ఇంటర్వ్యూ ఉంటాయి.  పై విద్యార్హతలు, అనుభవాలు గల అభ్యర్థులు బిఇఎల్ వెబ్ సైట్ నుంచి ఆన్ లైన్ అప్లై చేసుకోవచ్చును. 

రాత పరీక్ష, ఇంటర్వూ సమయంలో అభ్యర్థులు ఈ ఒరిజినల్ సర్టిఫికేట్లను చూపించవలసి ఉంటుంది- ఎస్ఎస్ఎల్ సి మార్క్స్ కార్డ్, బిఇ లేక బిటెక్ డిగ్రీ సర్టిఫికేట్ తో పాటు ప్రతి సెమిస్టర్ కీ పొందిన మార్కులు, కుల ధృవీకరణ, వికలాంగ ధృవీకరణ పత్రాలు నిర్ణీత ఫార్మెట్ లో,  వాటితో పాటు వాటన్నిటికీ ఒక్కో కాపీ, ఈ మధ్యకాలంలో తీసుకున్న కలర్ ఫొటో వెంట తెచ్చుకోవలసివుంటుంది. 

అభ్యర్థులతో ఉత్తర ప్రత్యుత్తరాలు కేవలం ఇమెయిల్ ద్వారా నే జరుగుతాయి.  ఇమెయిల్ లో వచ్చే సాంకేతిక లోపాలకు భారత్ ఎలక్ట్రానిక్స్ బాధ్యత వహించదు. 

ఇతర నియమాలు

ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఎస్ సి, ఎస్ టి, ఓబిసి, పిడబ్ల్యుడి అభ్యర్థులకు మినహాయింపులు ఉంటాయి.  ఎస్ సి, ఎస్ టి అభ్యర్థులకు ఇంజినీరింగ్ మార్క్స్ లో కనీస మార్కులలో 50 శాతాన్ని పరిగణలోకి తీసుకోబడుతుంది.  వయో పరిమితిలో ఓబిసి అభ్యర్థులకు 3 సంవత్సరాలు, ఎస్ సి ఎస్ టి పిడబ్ల్యుడి అభ్యర్థులకు 5 సంవత్సరాల పెంపు ఉంటుంది.

బిఇ డిగ్రీ పూర్తి చెయ్యనివారు అప్లై చెయ్యవలసిన పని లేదు. రాత పరీక్ష ఇంటర్వ్యూ సమయంలో ఏ కారణం చేతనైనా బిఇ మార్క్స్ కార్డు, ఒరిజినల్ సర్టిఫికేట్లు తీసుకుని రాలేకపోతే వారిని పరిగణనలోకి తీసుకోబడదు.

అర్హతలుగల అభ్యర్థులు అవసరానికి మించి ఉంటే వారి విద్యార్హతలు, అనుభవాన్ని బట్టి ఎంపిక చెయ్యటం జరుగుతుంది.

స్థానిక అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.  భారత దేశ పౌరసత్వం కలవారికి మాత్రమే ఇది వర్తిస్తుంది.

ఎంపిక జరుగుతున్న సమయంలో అభ్యర్థులను అనర్హులుగా ప్రకటించే అధికారం భారత్ ఎలక్ట్రానిక్స్ కి ఉంది.  కాన్వాసింగ్ చేసిన అభ్యర్థులు అనర్హులౌతారు.

06.02.2014 వరకు ఆన్ లైన్ లో అందిన అప్లికేషన్లను మాత్రమే పరిగణనలోకి తీసుకోబడతాయి. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles