Super moon

Super Moon on 31st Jan, Super five times in 2014, Second super moon 31st Jan, First super moon 1st jan

super moon on 31st January is second in the year

అతిపెద్ద చంద్రుడు

Posted: 01/29/2014 04:59 PM IST
Super moon

రానున్న రోజుల్లో అతిపెద్ద చంద్రుడు (సూపర్ మూన్) ని చూడబోతున్నాం.

భూమికి అతి దగ్గరగా వచ్చి ఈ  2014 వ సంవత్సరంలో అలా పెద్దగా కనిపించే సందర్బాలలో ఇది రెండవది.  ఈ నెలలో జనవరి 1 న భూమికి అతి చేరువగా వచ్చిన చంద్రుడు మరోసారి ఇదే నెలాఖరు రోజున దగ్గరగా కనిపించటం విశేషం.  ఇలా ఒకే నెలలో రెండు సార్లు భూమికి దగ్గరగా రావటమనేది మళ్ళీ జనవరి 2018 వరకు జరగదు.  శుక్రవారం జనవరి 31 నాడు అతి పెద్ద చంద్రుడు తెల్లవారు ఝామున 3.30 కి వస్తాడు. 

ఈ సంవత్సరంలో అతి పెద్ద చంద్రుడు దర్శనమిచ్చే మిగతా సందర్భాలు జూలై 12, ఆగస్ట్ 10, సెప్టెంబర్ 9. 

పెద్ద చంద్రుడు మామూలుగా కనిపించే పరిమాణానికి 14 శాతం పెద్దగాను, 30 శాతం ఎక్కువ కాంతిని వెదజల్లుతూ కనిపిస్తాడు. 

అతి పెద్ద చంద్రుడిని గమనించటమనేది మొదటిసారిగా 1979 లో అంటే 30 సంవత్సరాల క్రితం జరిగింది.  అలాంటి సందర్భంలో సూర్యుడు, భూమి, చంద్రుడు సరళ రేఖలో ఉండటం జరుగుతుంది. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles