Rbi raise in lending interest rates to curb inflation

RBI raise in lending interest rates to curb inflation, Reserve Bank Of India, India high in Asia in Inflation, RBI lending commercial banks

RBI raise in lending interest rates to curb inflation

ఆర్థిక మాంద్యంలో భారత్ ఆసియా ఫస్ట్!

Posted: 01/29/2014 02:19 PM IST
Rbi raise in lending interest rates to curb inflation

ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కోవటం కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ ఋణాల మీద వడ్డీ రేటుని పెంచింది.   ఇతర బ్యాంక్ లకు రిజర్వ్ బ్యాంక్ ఇచ్చే ఋణాల మీద ఇంతకు ముందున్న 7.75 శాతాన్ని 8 శాతానికి పెంచింది.  దానితో పాటుగా, ఆర్ధిక మాంద్యం దీనితో నియంత్రణలోకి వచ్చినట్లయితే ఈమధ్యకాలంలో మరోసారి పెంచవలసిన అవసరం పడకపోవచ్చంటోంది ఆర్ బి ఐ. 

ఆర్థిక మాంద్యానికి కొలమానమైన హోల్ సేల్ ప్రైస్ ఇండెక్స్ (డబ్ల్యు పి ఐ) ని డిసెంబర్ నెలలో పరిశీలిస్తే అది అంతకు ముందు సంవత్సరం కంటే 6.16 శాతం పెరిగినట్లు తెలిసింది.  ఇతర దేశాల చూసినట్లుగా ఆర్థిక మాంద్యాన్ని డిసంబర్ నెలలోనే కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స తో పోల్చి చూస్తే, సంవత్సరంలో 9.87 వృద్ధి జరిగింది. 

ఆర్థిక మాంద్యం పెరగటం వలన నిత్యావసర వస్తువుల కొనుగోలులో తేడా వస్తుందని, వస్తువులను కొనే ఆర్థిక స్తోమతులో తేడా వస్తుందని ఆర్ బి ఐ చెప్తోంది.  2016 నాటికి ఆర్థిక మాంద్యంలో 4 శాతానికి తీసుకుని రావాలనే ప్రతిపాదనలో ఉన్నట్టుగా తెలియజేస్తోంది. 

భారత దేశంలో ఆసియాలోనే అతి పెద్ద ఆర్థిక మాంద్యం రాజ్యమేలుతోంది.  ధరలు పెరిగిపోవటంతో ఆర్థిక పరమైన అభివృద్ధి కుంటుపడింది.  దానికి తోడు భారత దేశ కరెన్సీ విలువ ప్రపంచ మార్కెట్ లో గత సంవత్సరకాలంలో 14 శాతం పడిపోయింది.  దానితో దిగుమతుల మీద ఆధారపడ్డ వస్తువుల మీద ధరలు పెరిగిపోయాయి.  ఆర్థిక మాంద్యం పెరిగిపోవటంతో ఖర్చు తగ్గించుకోవటం జరుగుతుంది.  ప్రపంచ బ్యాంక్ పరిశీలన ప్రకారం భారతదేశంలో మూడింట రెండు వంతుల మంది కేవలం రోజుకి 2 డాలర్లతో జీవితం గడుపుతున్నారు. 

ఆర్థిక మాంద్యం పేదవాడి మీదనే పెనుభారాన్ని కలిగిస్తుందని చెప్తోంది ఆర్ బి ఐ.  ఉత్పాదన చేసే సంస్థల ముడి సరుకు ధర పెరిగిపోవటంతో వాళ్ళ ఉత్పాదన ధర కూడా పెరిగిపోతుంది.  ఆర్ధిక మాంద్యం పెద్ద సమస్యగా మారి రాజకీయంగా కూడా వ్యతిరేకత వస్తుండటంతో పెరుగుతున్న ధరలను నియంత్రించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.  పెరిగిపోయిన నిత్యావసర వస్తువులు గత ఎన్నికలలో ప్రభావం చూపించింది.  మళ్ళీ మే నెల వరకు ప్రారంభం కానున్న ఎన్నికలకు సమాయత్తమవుతున్న భారత ప్రభుత్వానికి ఈ సమయంలో వడ్డీ రేట్లు పెంచటం నిజానికి సాహసవంతమైన చర్యే.  కానీ దాని వలన ఆర్థిక మాంద్యం తగ్గిపోతుందన్న నమ్మకంతో ఆర్థిక స్థితి అభివృద్ధి చెందకపోయినా పరవాలేదన్న నిర్ణయానికి వచ్చింది రిజర్వ్ బ్యాంక్. 

ఈమధ్యకాలంలో ఆహార పదార్థాల ధరలు తగ్గినా, రిజర్వ్ బ్యాంక్ దాన్ని నమ్మి నిశ్చింతగా ఉండదలచుకోలేదు.  ఆర్థిక మాంద్యాన్ని తగ్గించటమే లక్ష్యంగా పెట్టుకుని వడ్డీ రేట్లను పెంచటం జరిగింది. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles