Voting on cm resolution says assembly speaker

voting on cm resolution says Assembly speaker, Speaker Nadendla Manohar, Chief Minister Kiran Kumar Reddy, AP State bifurcation, CM resolution on T Bill

voting on cm resolution says Assembly speaker

సిఎం తీర్మానం మీద ఓటింగ్ జరగాల్సిందే- సభాపతి

Posted: 01/29/2014 01:08 PM IST
Voting on cm resolution says assembly speaker

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వేసిన చివరి అస్త్రం ఆయన బిల్లుని తిప్పి పంపించేయాలని చేసిన తీర్మానం.  దాని మీద వోటింగ్ జరగాల్సిందేనంటూ ఈరోజు సంచలనమైన తీర్పు నిచ్చారు సభాపతి నాదెండ్ల మనోహర్.  సభానాయకుడైన ముఖ్యమంత్రి తీర్మానాన్ని పక్కకు పెట్టటం కుదరని పని అని,
ఒకపక్క బిల్లు మీద అది తప్పుల తడకని, దానికి సాధికారకత లేదని, దాన్ని తిప్పి పంపించాలని తీర్మానాన్ని చేస్తూనే మరో పక్క ముఖ్యమంత్రి బిల్లు మీద చర్చకు మరో మూడు వారాల గడువు కావాలని కోరటం విశేషం. 
ఇప్పుడీ బిల్లుని తిరస్కరించినట్లుగా సభలో ఓటింగ్ లో నిర్ణయం జరిగితే ఏమవుతుందనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. 
శాసనసభలో జరుగుతున్న ప్రక్రియంతా ఎప్పటికప్పుడు గమనిస్తూ వస్తున్న కేంద్ర హోం మంత్రిత్వ శాఖలో ముఖ్యమంత్రి తీర్మానం అలజడి రేపుతోంది.  ఒకవేళ ఓటింగ్ లో బిల్లుని తిరస్కరించినట్లయితే విభజన ప్రక్రియ కుంటుబడుతుందని భావిస్తున్నారు.
-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles