Man eater tiger killed at ooty

Man eater tiger killed at Ooty, Total tigers 1700, India forest department, Tiger hunting, Killing of tiger, Man eater tigers

man eater tiger killed at Ooty

మనుషులను పొట్టనపెట్టుకున్న పులి హతం

Posted: 01/23/2014 01:11 PM IST
Man eater tiger killed at ooty

అటవీ అధికారుల వివరణ ప్రకారం తమిళనాడులోని ఊటీకి దగ్గర్లో ఉన్న దొడ్డబెట్టా అరణ్యంలో మనుషులను, ఎన్నో పశువులను పొట్టబెట్టుకున్న పులి అటవీ దళం వారు తుపాకీతో కాల్చి చంపారు.  

పులి కదలికలను కనిపెట్టటానికి అధికారులు సమీప గ్రామంలోను, టీ ఎస్టేట్ లోను 65 సిసి కేమెరాలను ఏర్పాటు చేసారు.  దాదాపు 45 పాఠశాలలకు శలవులిచ్చి గ్రామవాసులు బిక్కుబిక్కుమంటూ ఇళ్ళకే పరిమితమైపోయారు.  పులిని కాల్చి చంపటానికి కొద్ది సేపటి క్రితమే అది ఒక గేదెను భక్షించింది.  

కలెక్టర్, అటవీ సిబ్బంది మానవ సంహారి పులి ని మట్టుపెట్టటానికి అడవి లోపలికి వెళ్ళారని చెప్పిన జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని అధికారి ఆ పులిని తుపాకీతో కాల్చి చంపారే కానీ దానికి మత్తు మందు ప్రయోగించే పని చెయ్యలేదని అన్నారు.

ఒక శతాబ్దం ముందు లక్ష పులులున్న భారత దేశపు అడవులలో, అటవీ శాఖవారి పులుల లెక్క ప్రకారం దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న పులుల సంఖ్య 1700.  వాటిలో కొన్ని ఒక్క నెల రోజుల కాలంలో 17 మంది మనుషులను చంపితిన్నాయి.  

పులివాతతో వేదనకు గురైన గ్రామవాసులు అటవీ శాఖవారిమీద ఒత్తిడి తీసుకునివచ్చారు.  మీరు అడ్డుకుంటారా లేక మేమే మా చేతుల్లోకి తీసుకోవాలా అని ప్రశ్నించారు.  

పులికి వారానికో పెద్ద వేట అవసరం పడుతుంది.  అంటే సంవత్సరానికి ప్రస్తుతమున్న పులుల లెక్క ప్రకారం 85000 సార్లు వేటాడుతాయి.  అందులో సంవత్సరానికి 85 మంది మనుషులు వాటి బారిన పడి చనిపోవటమో లేక గాయపడటమో జరుగుతోంది.  అయితే పులులు వలన కాకుండా పాము కాటు, లేక కుక్క కాటు వలన చనిపోతున్నవారి సంఖ్యలో ఇది చాలా చిన్నది కదా అందుకోసం పులుల మీద పగబట్టి వధించటం తగునా అని కొందరి ప్రశ్న.  

ఒకవేళ మానవాహారానికి అలవాటుపడి మానవ సంహారానికి పూనుకున్నట్లయితే అటువంటి పులులను పట్టి బంధించాలి కానీ వధించటం సరైనది కాదని విజ్ఞులు, అరణ్య జంతుజాలాన్ని సంరక్షించేవారి వాదన.  అయితే మనుషులను చంపటం మొదలుపెట్టిన వెంటనే తగిన చర్య తీసుకోవల్సి వుంటుంది.  లేకపోతే గ్రామవాసుల ఆవేశాలు హద్దుమీరుతాయి.  అంతేకాదు, జంతుజాలాన్ని రక్షించాలనుకునే ప్రణాళికలకు పౌరుల మద్దతు తగ్గిపోతుందని కొందరు అంటున్నారు.  

కానీ విస్తృత అధికారాలతో ముందు పులిని వేటాడి చంపి అది మనుషులను భుజించటం మరిగిందని అనటానికి కూడా అవకాశం ఉంది.

మానవ సంహారి పులుల విషయం ఇక్కడ పరిగణనలోకి తీసుకోవలసింది మరో విషయం కూడా ఉంది.  మనుషులకోసం దారి కాచి వేటాడుతోందా లేకపోతే అనుకోకుండా ఎదురుపడ్డప్పుడు తన ప్రాణ రక్షణకోసం చంపవలసివచ్చిందా అన్నది చాలా ముఖ్యం.  ఆ పులి మానవ సంహారా కాదా అన్నది ముందు సరిగ్గా నిర్ణయించి ఆ తర్వాత దాని మీద తగు చర్య తీసుకోవలసి ఉంటుందని ఫీల్డ్ బయోలజిస్ట్ లు అంటున్నారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles