Giving birth toughest at ladakh

Giving birth, Giving birth toughest at Ladakh, walk 9 days for maternity help, Walk in -35C for delivery

Giving birth toughest at Ladakh

బిడ్డను కనటం కష్టమే కానీ మరీ ఇంత కష్టమా?

Posted: 01/23/2014 03:47 PM IST
Giving birth toughest at ladakh

సృష్టిలో ప్రతి ప్రాణికీ ప్రాణకోటిలోని తన జాతిని వృద్ధి చెయ్యటానికి ప్రకృతి చేసిన ఏర్పాటు సంతాన ప్రాప్తి.  అది అండజాలు, క్షీరజాలలోనూ ఇవ్వబడింది.  ఈ పని ఇతర జంతుజాలంలో సునాయాసంగా జరిగిపోతుంది.  కానీ విజ్ఞాన శాస్త్రంలో అన్నిటినీ అధిగమించి, సృష్టిని తనకు కావలసినట్లుగా మార్చుకునే ప్రయత్నం తను మాత్రమే చెయ్యగలనని విర్రవీగే మానవ జాతికి మాత్రం సంతానోత్పత్తి పెద్ద సమస్యా జనితమైన జటిలమైన కార్యంగానే తయారైంది. 

గర్భం దాల్చిన దగ్గర్నుంచీ మానవులకు వైద్యుల, సంతానోత్పత్తి నిపుణుల వైద్య సలహాలు, వైద్యోపచారాలు, ఔషధాల అవసరం పడుతోంది.  పుస్తకాలు, సలహా సంప్రదింపులతోనూ, స్కానింగ్ లతోనూ ఎప్పటికప్పుడు గర్బస్థ శిశువు స్థితిని గమనిస్తూ శిక్షణ పొందిన డాక్టర్లు, నర్సుల సహాయంతో ప్రసవించటం, ఆ తర్వాత పీడియాట్రిక్స్ లో పట్టభద్రులైన వారిని సంప్రదిస్తూ శిశువు పోషణ చెయ్యటం, బాలారిష్టల నుంచి తప్పించే టీకాలు లాంటి వ్యాధి నిర్మూలనా కార్యక్రమాలను ఉపయోగించుకోవటం ఇలా ఎన్నో విధాలుగా జాగ్రత్తలు తీసుకుంటూ పెంచి పెద్ద చెయ్యటం జరుగుతోంది.  చాలా సంతోషం- విజ్ఞాన శాస్త్రంలో ఇంత అభివృద్ది కలిగినందుకు.

సైన్స్ లో కలిగిన అభివృద్ధితో శిశువులను కని పెంచటం ఎంతో సులభం చేసామనుకుంటున్న మానవులకు ఇలాంటి సదుపాయాలేమీ లేకుండానే జీవితాలను గడుపుతున్న తన సాటి మానవుల గురించి తెలుసుకున్నప్పుడు ఎటువంటి అనుభూతి కలుగుతుందో మీరే చూడండి.

 

అది ఉత్తర భారతంలో లడఖ్ ప్రాంతం.  సమీపంలోని హాస్పిటల్ 45 మైళ్ళ దూరంలో ఉంది.  అక్కడికి చేరుకోవటానికి నడక తప్ప వేరే మార్గం లేదు.  సముద్ర మట్టానికి 11123 అడుగుల ఎత్తున ఉన్న ప్రదేశంలో కొండల మధ్య -35 సెంటిగ్రేడ్ లో గడ్డకట్టే చలిలో, గడ్డకట్టిన నదీ ప్రవాహం మీద నడుచుకుంటూ 9 రోజుల ప్రయాణం చేస్తే కానీ హాస్పిటల్ చేరుకోలేని పరిస్థితిలో కూడా సృష్టి ధర్మమైన సంతానోత్పత్తి కోసం గర్భిణీ స్త్రీ వెళ్తోందన్నది సత్యం.  అది సగ భాగమే.  పుట్టిన బిడ్డను జాగ్రత్తగా మళ్ళీ అంతే దూరం తిరిగి తీసుకుని పోవటం రెండవ భాగం.  ఇలాంటి పరిస్థితుల్లో గర్భిణీ స్త్రీ వేదన, ఇతర కుటుంబ సభ్యుల ఆవేదన మనం అర్థం చేసుకోవచ్చు. 

ఫోటోల్లో చూస్తుంటేనే ఒళ్ళు గగుర్పొడుస్తోంది కదూ.  ఇక వాళ్ళ దైనందిన జీవితం ఎలా ఉంటుందో ఆలోచించండి.

రాత్రి పూట గుహల్లో చలికాచుకుంటూ

అతి కష్టమైన ప్రయాణం

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles