Charge sheet on suraj pancholi for jia suicide

charge sheet on Suraj Pancholi, Jia Khan suicide, Jia Mother Rabia, Jia Suraj Pancholi relation, Bail to Suraj Pancholi

charge sheet on Suraj Pancholi for Jia suicide

జియా కేసులో సూరజ్ పంచోలీ మీద చార్జ్ షీట్

Posted: 01/22/2014 03:21 PM IST
Charge sheet on suraj pancholi for jia suicide

జియాఖాన్ ఆత్మహత్య కేసులో ఆదిత్య పంచోలీ కుమారుడు సూరజ్ పంచోలీ మీద ఈ రోజు అంధేరీ మాజిస్ట్రేట్ కోర్టులో 447 పేజీల ఛార్జ్ షీట్ ఫైలయింది.  సూరజ్ పంచోలీ తన ప్రియురాలు జియా ఖాన్ ఆత్మహత్యకు పాల్పడటానికి కారకుడని లభించిన సాక్ష్యాధారాలతో నిర్ణయానికి వచ్చిన పోలీసులు చార్జ్ షీట్ ని ఫైల్ చేసారు. 

ఫోరెన్సిక్ రిపోర్ట్ కాకుండా ఇరవై రెండు మంది సాక్ష్యులను విచారించిన మీదట పోలీసులు ఈ నిర్ణయానికి వచ్చారని తెలిసింది.  సాక్ష్యులలో జియా కి అబార్షన్ చేసిన డాక్టర్, జుహూలో జియా నివసించే అపార్ట్మెంట్ భవనంలో వాచ్ మన్, ఒక ఫ్లోరిస్ట్, పంచోలీ ఇంటిలో పనిచేసే నౌకర్, సూరజ్ స్నేహితులు కూడా ఉన్నారు.

జూన్ 3 2013 న జుహూ లో తన అపార్ట్మెంట్ లో హిందీ సినిమా నటి జియాఖాన్ ఆత్మహత్య చేసుకున్న తర్వాత ఆమె తల్లి రబియా జియా రాసిన ఆరు పేజీల లేఖను బహిర్గతం చేసారు.  అందులో జియా తన ప్రియుడు సూరజ్ తో గల సంబంధం, అందులో ఎదుర్కుంటున్న సమస్యల గురించి రాసివుంది.  పోలీసులు సూరజ్ ని సెక్షన్ 306 కింద అరెస్ట్ చెయ్యగా ముంబై హైకోర్టు అతనికి బెయిల్ మంజూర్ చేసింది.  వాళ్ళిద్దరి మధ్యా సంబంధం సరిగ్గా లేకపోయినా జూన్ 3 న సూరజ్ ఆమెను ఆత్మహత్యకు ప్రేరేపించిన దాఖలాలు లేవని హైకోర్టు అభిప్రాయపడింది.  పైగా అంతకు ముందుకూడా కొన్ని సందర్భాలలో ఆత్మహత్యకు ప్రయత్నం చేసిన జియాకి సూసైడల్ టెండెన్సీ ఉందని కూడా హైకోర్టు నమ్మటం జరిగింది.  అయితే ఆ రోజు సూరజ్ జియాని కలవటానికి తిరస్కరించటం జరిగిందని దర్యాప్తు చేస్తున్న పోలీస్ అధికారి అన్నారు. 

జియా తల్లి రబియా జియాది ఆత్మహత్య కాదు హత్యేనని అభియాగం మోపారు.  కానీ హత్య అని చెప్పటానికి ఎటువంటి ఆధారాలు దొరకలేదు.  దీని మీద ఫిబ్రవరి 12 న సెషన్స్ కోర్టులో విచారణ మొదలవుతుంది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Hero srihari attended apollo the diabetes meeting
Sec 144 lifted in old city  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles