Sunanda death by drug poison

Sunanda death by drug poison, Sunanda Pushkar death, Sunanda son Shiv Menon, Shiv Menon talks on Sunanda death, Sunanda mysterious death

Sunanda death by drug poison

సునందకి విషప్రయోగం, ఆత్మహత్య కాదన్న కుమారుడు

Posted: 01/22/2014 12:49 PM IST
Sunanda death by drug poison

దక్షిణ ఢిల్లీ హోటల్లో జనవరి 17 న అనుమానస్పద పరిస్థితులలో మృతిచెందిన సునంద పుష్కర్ పోస్ట్ మార్టమ్ నివేదికలో ఆమె డ్రగ్ పాయిజనింగ్ తో చనిపోయినట్లుగా నిర్ధారించటం జరిగింది. 

ఆమె రెండవ భర్త సుజిత్ మీనన్ వలన జన్మించిన కుమారుడు శివ్ మీనన్ మీడియా ముందు మొదటిసారిగా మాట్లాడుతూ, తన తల్లి చాలా ధైర్యవంతురాలని, ఆమెది ఆత్మహత్య అయ్యే అవకాశం లేశమంతైనా లేదని అన్నారు.  అంతేకాదు తన తల్లికి, తన మారు తండ్రి శశి థరూర్ కి మధ్య విభేదాలేమీ లేవని వారి మధ్య అన్యోన్యతే ఉండేదని కూడా తెలియజేసారు శివ్ మీనన్. 

డ్రగ్ పాయిజనింగ్ అంటే అదెవరో చేసిన విషప్రయోగమని మీడియా కోడై కూస్తున్నది కానీ ఆమె రోజూ వేసుకునే వివిధ ఔషధాల మిశ్రమంలో తేడా వచ్చివుండవచ్చని శివ్ అన్నారు.  తన తల్లి సునంద చాలా ప్రశాంతంగా సునాయాస మరణంతో కన్నుమూసారని అని అన్న శివ్, ఇప్పటికే ఆమె మీద చాలా విశేష ప్రచారం జరిగిందని, ఇప్పటికైనా ఆమె ఆత్మకు ప్రశాంతను కలుగజేయమని, ఇక ఆమె జీవితం గురించి తవ్వటం నిలిపివేయమని మీడియాను అర్థించారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles