Telugu cine industry mourning on thursday

Telugu Cine Industry mourning on Thursday, ANR Dead, Akkineni Nageswara Rao Died, Akkineni Nageswara Rao is no more, akkinenni nageswara rao, nagarjuna, Akkineni Nageshwar Rao Cancer, ANR Death, Celebrity Death, Telegu Cinema, Telugu films, hyderabad, cancer, died

Telugu Cine Industry mourning on Thursday

సినీ పరిశ్రమలో సంతాప దినం

Posted: 01/22/2014 01:08 PM IST
Telugu cine industry mourning on thursday

గురువారం నాడు అక్కినేని నాగేశ్వరరావు అంత్యక్రియలు జరుపనున్నారు.  ఆ రోజు తెలుగు సినీ పరిశ్రమ సంతాప దినంగా పాటిస్తున్నది.  మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు మురళీ మోహన్ చిత్ర పరిశ్రమలోని అన్ని యూనియన్లూ ఆ సందర్భంగా బంద్ ని పాటించాలని పిలుపునిచ్చారు.  అలాగే థియేటర్లన్నీ ప్రదర్శనలను నిలిపివేయాలని కూడా ఆయన కోరారు.

అంత్య క్రియలకు సమయ నిర్ణయం ఇంకా జరగలేదు.  అన్నపూర్ణ స్టూడియోస్ లో దివంగత అక్కినేని నాగేశ్వరరావు భౌతిక కాయాన్ని సందర్శించిన మంత్రి డి.కె.అరుణ రేపు ఆయనకు పోలీసు లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహిస్తారని తెలియజేసారు. 

అక్కినేని నాగేశ్వరరావు భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించటానికి పెద్ద ఎత్తున అభిమానులంతా తరలి వస్తున్నారు.  అందువలన వారంతా చూడటానికి వీలుగా అన్నపూర్ణ స్టూడియోస్ లో విస్తృతమైన ఏర్పాట్లు చేస్తున్నారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles